Breaking News
Home / Tag Archives: V Hanumantha rao

Tag Archives: V Hanumantha rao

ఢిల్లీ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం సూచించింది. సోమవారం వివిధ రాష్ట్రాల నేతలతో జరిగిన సమావేశంలో, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, వి.హనుమంతరావు హాజరయ్యారు. ఢిల్లీలో ఉన్న తెలుగు ఓటర్లను పార్టీ వైపు మళ్లించేలా ప్రణాళికలు రూపొందించాలని, పార్లమెంట్ సమావేశాల తర్వాత తెలుగు వారు ఉన్న ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు.

Read More »

ఏపీకి 3 రాజధానుల విషయమై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఏపీకి మూడు రాజధానుల విషయమై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానుల వల్ల నష్టమే తప్ప లాభం లేదన్నారు. ప్రజాధనం వృథా అవడమే తప్ప ఉపయోగం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండగా.. మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ ముద్ర కోసమే రాజధానులు, కొత్త నిర్మాణాలు అంటున్నారని వీహెచ్ పేర్కొన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన …

Read More »

వారి డిమాండ్లు నెరవేరేవరకు మద్దతిస్తాం…

హైదరాబాద్: కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు చెప్పినా సీఎం కేసీఆర్‌ లెక్క చేయకపోవడం నియంతృత్వానికి నిదర్శనమని అన్నారు. కోర్టు కామెంట్‌ చేస్తే గతంలో నాయకులు పదవులకు రాజీనామా చేసేవారని, ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు చీమకుట్టినట్లైనా లేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని, వారి న్యాయపరమైన డిమాండ్లు నెరవేరేవరకు మద్దతిస్తామని చెప్పారు. ఆర్టీసీ కండక్టర్ సురేందర్‌గౌడ్‌ కుటుంబానికి …

Read More »

కార్మికులు అమ్ముడు పోయారనడం సిగ్గుచేటు….

సూర్యాపేట: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత వీహెచ్‌ సూర్యాపేట ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్‌ మొండి వైఖరి వీడాలని హితవు పలుకుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని, సమ్మెను అణగదొక్కాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ నేతలకు ఆర్టీసీ కార్మికులు అమ్ముడు పోయారని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడటం సిగ్గుచేటు అని వీహెచ్‌ విమర్శించారు.

Read More »

హుజూర్‌నగర్‌ ఎన్నికలపై వీహెచ్ జోస్యం…

హైదరాబాద్: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు జోస్యం చెప్పారు. జనసేన మద్దతుతో కాంగ్రెస్ మరింత బలపడుతుందని, నామినేషన్ వేసేందుకు వచ్చిన సర్పంచుల ఫోరమ్‌ నేతలను జైల్లో పెట్టి నియంతలా పాలిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వీహెచ్ ప్రకటించారు.

Read More »