Breaking News
Home / Tag Archives: vijayawada

Tag Archives: vijayawada

వచ్చే 2 వారాలు అత్యంత కీలకం

విజయవాడ: రానున్న రెండు వారాలు అత్యంత కీలకమైనవని, కరోనా ని యంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ముందుకు వెళ్లాలని కేంద్ర కెబినేట్‌ కార్యదర్శి రా జీవ్‌గౌబ తెలిపారు. కరోనా నియంత్రణకు అనుసరించాల్సిన కంటైన్‌మెంట్‌ విధానంపై ఓరియంటేషన్‌ కం శిక్షణా సెషన్‌ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు, పోలీస్‌ అధికారులతో ఆదివారం సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కంటైన్‌మెంట్‌ …

Read More »

కృష్ణా జిల్లాలో హైఅలర్ట్…

విజయవాడ: కృష్ణా జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీ మొత్తంలో కృష్ణా జిల్లాలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా 23 కేసులు పెరగడంతో జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. హై అలర్ట్ జోన్‌గా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలను ప్రకటించారు. ఒక్క విజయవాడలోనే కరోనా పాజిటివ్ కేసులు 18కి చేరుకున్నాయి. జగ్గయ్యపేటలో 2, నూజివీడు 2, నందిగామలో ఒక కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ఆ ప్రాంతాలన్నింటినీ …

Read More »

ఏపీలో తొలి కరోనా మరణం…

ఏపీలో తొలి కరోనా మరణం నమోదైంది. ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొని విజయవాడ వచ్చిన ఒక వ్యక్తికి కరోనా సోకగా.. అతడి తండ్రి తాజాగా మృతి చెందాడు. మరణించిన అనంతరం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని కేంద్రం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కాగా ఏపీలో ఇప్పటివరకు 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read More »

విజయవాడలో రెండు ప్రాంతాల్లో కర్ఫ్యూ

విజయవాడ: విజయవాడలో కరోనా కలకలంతో కర్ఫ్యూ విధించారు. విజయవాడలోని భవానీపురం, పాతరాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. లాక్‌డౌన్ ఉన్నా కానీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. అత్యవసరం అయితే తప్పితే జనాలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు ఏపీలో ఇప్పటి వరకు 58 కరోనా పాజిటివ్ కేసులు.. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 14 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More »

ఢిల్లీ సభకు వెళ్లొచ్చాకే ఘటన….?

ఢిల్లీ సభకు వెళ్లొచ్చాకే ఘటన ‘కరోనా’ను ధ్రువీకరించని వైద్యులు విజయవాడ/కాకినాడ: ఏపీలో ముగ్గురు వ్యక్తులు కరోనా అనుమానిత లక్షణాలతో మరణించారు. వైద్యాధికారులు మాత్రం ఇతర అనారోగ్య కారణాలవల్లే వీరు చనిపోయినట్లు తెలిపారు. వీరు ముగ్గురూ ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారే. విజయవాడకు చెందిన మహిళ ఆదివారం మరణించగా, సోమవారం ఆమె భర్త కూడా చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లా కాతేరుకు చెందిన వ్యక్తి (62) సోమవారం …

Read More »

విజయవాడలో మరో కరోనా కేసు…

విజయవాడ: నగరంలో కరోనా వైరస్ మూడో పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు పరిసరాల్లో నివసిస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన యువకులు కలిసిన వారి వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిపై అధికారులు మరింత దృష్టి సారించారు.

Read More »

ఆలయంలో కొండ చిలువ కలకలం

దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మార్గంలో భక్తుల సంచారం లేకపోవడంతో.. విజయవాడలోని క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆలయంలో కొండచిలువ పుష్పాల మధ్య మంగళవారం సేద తీరింది. పూజ చేసేందుకు వచ్చిన అర్చకులు చిలువను చూసి ఆందోళనకు గురయ్యారు. గతంలో మల్లేశ్వరాలయ పునరుద్ధరణ పనుల సమయంలో జనసంచారం లేకపోవడంతో 12 అడుగుల తాచుపాము మల్లేశ్వరాలయం లోపలికి వచ్చింది. భక్తుల సంచారం లేనందున దేవస్థానం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం అధికారులు సూచించారు.

Read More »

నిబంధనలు ఉల్లంఘించే వారిపై నేటి నుంచి చర్యలు మరింత కఠినం

విజయవాడ: లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై విజయవాడలో అధికారులు నేటి నుంచి చర్యలను మరింత కఠినం చేయనున్నారు. నేటి నుంచి బహిరంగ స్థలాల్లోకి రైతు బజార్లను మార్చనున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతి లేదు. నగరం వెలుపలతోపాటు నగరంలో రాకపోకలన్నింటినీ బంద్ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిన్న ఒక్కరోజే 70 కేసులు నమోదు చేశారు.

Read More »

ఇంటర్‌ చివరి పరీక్ష వాయిదా…

విజయవాడ : కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజున జరగాల్సిన ఇంటర్మీడియట్‌ చివరి పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటన చేసింది. త్వరలోనే వాయిదా పడిన పరీక్షకు సంబంధించిన కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. కాగా, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యవసర …

Read More »

బ్లాక్ మార్కెట్‌పై గట్టి నిఘా వేశాం: జగన్

అమరావతి: రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్, ఈ లాక్‌డౌన్‌ను ఆసరా చేసుకుని చెలరేగిపోవాలనుకునే వారికి గట్టి హెచ్చరికలు చేశారు. కొన్ని అత్యవసర పరిస్థితుల్ని అదునుగా చూసి బ్లాక్ మార్కెట్ మాఫియా చెలరేగిపోతుందని.. కూరగాయలు, నిత్యవసరాల ధరలు పెంచి అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ అన్నారు. అన్నింటిపై ప్రభుత్వం గట్టి నిఘా ఉంటుందని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు.

Read More »