Breaking News
Home / Tag Archives: vijayawada (page 10)

Tag Archives: vijayawada

దుర్గగుడికి భక్తులు రావద్దు…

 విజయవాడ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున నేడు సాయంత్రం నుంచి బెజవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు ప్రకటించారు. అయితే అమ్మవారికి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేటి నుంచి ఘాట్‌లో వాహనాలు నిలిపివేస్తున్నామని వెల్లడించారు. తిరిగి అమ్మవారి దర్శనం ఎప్పుడు ఉంటుందనేది తర్వాత చెప్తామని తెలిపారు. అప్పటివరకు భక్తులు గుడికి రావద్దని విజ్ఞప్తి చేశారు. …

Read More »

ఏపీ గవర్నర్‌తో ఉన్నతాధికారులు భేటీ

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో గురువారం సాయంత్రం ప్రభుత్వ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ , డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఉన్నారు. స్థానిక ఎన్నికల వాయిదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ లేఖ అంశంపై వారు గవర్నర్‌తో చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సీఎస్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు.

Read More »

ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైసీపీదే విజయం

విజయవాడ: కరోనా వైరస్‌ దృష్యా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాలు వాయిదా వేస్తే దీనిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బహిరంగ సభలు, ర్యాలీలు పెట్టడం ద్వారా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే చంద్రబాబు ఎల్లో మీడియా మాత్రం ఎవరికో కంప్లైట్‌ …

Read More »

కరోనా వివరాలను వెల్లడించిన ఏపీ సర్కార్‌

అమరావతి: కోవిడ్‌-19 విజృంభణతో యావత్‌ ప్రపంచం వణికిపోతోంది. 136 దేశాలకు విస్తరించిన ఈ ప్రాణాంతక వైరస్‌ను అంటువ్యాధిగా పరిగణించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌-19ను ‘ప్రపంచ మహమ్మారి’గా ప్రకటించింది. ప్రాంతాలు దాటిన కరోనా ప్రపంచాన్ని కమ్మేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నిఘా, నియంత్రణ, నివారణతో వైరస్‌కు అడ్డుకుట్ట వేయొచ్చని వెల్లడిం‍చింది. ఈమేరకు ఏపీ …

Read More »

బ్రేకింగ్‌: ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. కాగా, ఇప్పటివరకూ జరిగిన ఎన్నిక ప్రక్రియ యధావిథిగా ఉంటుందని, …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ దీక్షలు

విజయవాడ: మహా విద్యాపీఠం, ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో మార్చి 25 నుండి ఏప్రిల్ 2 వరకూ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు శ్రీరామ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహా విద్యాపీఠం వ్యవస్ధాపకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శ్రీరామ దీక్ష చేపట్టడానికి దాదాపు లక్షమంది సిద్ధంగా ఉన్నారన్నారు. దీక్షకు సంబంధించిన శ్రీరామ రక్షా స్తోత్రం కరపత్రాలు, జపమాలలు, బ్యానర్లు, జెండాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని …

Read More »