Breaking News
Home / Tag Archives: vijayawada (page 30)

Tag Archives: vijayawada

రేపు దుర్గమ్మ ఆలయం మూసివేత…

విజయవాడ: ఈనెల 26న సూర్యగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని అర్చకులు మూసివేయనున్నారు. రేపు రాత్రి 10 గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేయనున్నారు. తిరిగి 26 సాయంత్రం దుర్గమ్మ ఆలయం తెరుచుకోనుంది.

Read More »

ఇది రైతుల సమస్య కాదు… రాజధాని సమస్య

విజయవాడ: ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందనే వింత వైఖరిని తెరపైకి తెచ్చారని, ఇలాంటి పిచ్చి పనులు సరికావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. జగన్‌ పాలనలో కక్షసాధింపు ధోరణి కనపడుతోందన్నారు. జగన్‌వి పిల్ల చేష్టలని ఆయన మండిపడ్డారు. ఇది రైతుల సమస్య కాదని.. రాజధాని సమస్య అని అన్నారు. కేంద్రం హెచ్చరించినా జగన్‌ నియంతృత్వ ధోరణితో వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

ఏపీ మంత్రి వెల్లంపల్లి ఇంటి ఎదుట ధర్నా…

విజయవాడ: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా విజయవాడ వన్‌టౌన్‌లోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటి ఎదుట అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. ‘ఒక రాష్ట్రం- ఒక రాజధాని’ నినాదంతో నిరసన చేపట్టారు. పోలీసులు కలగజేసుకొని సమితి నేతలను అరెస్టు చేశారు.  

Read More »

హైకోర్టు తరలింపుపై న్యాయవాదుల నిరసన

హైకోర్టు తరలింపుపై న్యాయవాదుల నిరసన రేపు ‘చలో హైకోర్టు’: అడ్వొకేట్స్‌ జేఏసీ 27 వరకు ప్రతిరోజూ ఆందోళన కార్యక్రమాలు విజయవాడ: హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు కోర్టు విధులను బహష్కరించి నిరసన తెలపాలని అడ్వొకేట్స్‌ జేఏసీ తీర్మానించింది. ప్రతిరోజూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈనెల 24న ‘చలో హైకోర్టు’ చేపట్టాలని నిర్ణయించింది. ఆదివారం విజయవాడలో …

Read More »

స్పీకర్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత…

విజయవాడ: అమరావతిని ఎడారి అంటూ స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రంగా స్పందించారు. స్పీకర్ కళ్లులేని కబోదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతి ఎడారిలా ఉందని మాట్లాడటం తప్పు అన్నారు. స్పీకర్ సీతారం ఎడారిలో కూర్చొనే అసెంబ్లీని నడుపుతున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో 400 ఎకరాల ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని నిరూపిస్తే అసెంబ్లీ ఎదుట ఆత్మహత్య చేసుకునేందుకు తాను …

Read More »

రాజధానిపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు…

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘సాధారణంగా రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి.. కానీ అమరావతిలో అది నాకు కనిపించలేదు’’ అని సీతారాం అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. విమర్శలు చేస్తున్నవారు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. …

Read More »

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా….

విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీఆర్టీఎస్‌ రోడ్డులో కేక్‌ కట్‌ చేసి పేద పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆరునెలల పాలనలో సీఎం జగన్‌ పథకాలను వివరిస్తూ నిర్వహించిన ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని జై జగన్‌ అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం …

Read More »

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే…

విజయవాడ: జీఎన్ రావు కమిటీ ఒక భోగస్ అని.. ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకే వైసీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చెప్పినట్టే జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. రాజధాని ప్రాంత మంత్రులు కూడా ఈ ప్రాంత విశ్వాసాలను పరిగణలోకి తీసుకోకుండా‌ ఇష్టారాజ్యంగా మాట్లాడడం బాధాకరమని బోండా ఉమ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖలో గత ఆరు …

Read More »

ఆ ఘనత ఆయనకే దక్కుతుంది…

విజయవాడ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో చేనేతలకు మేలు జరిగిందని, ఆయన బాటలోనే సీఎం వైఎస్‌ జగన్‌ పయనిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని ప్రశంసించారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.

Read More »

ప్రకాశం బ్యారేజిపై ట్రాఫిక్‌ ఆంక్షలు

తాడేపల్లి టౌన్‌: విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో భవానీల ఇరుముడుల విరమణ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ ప్రకారం బ్యారేజీపై నుంచి వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. రద్దీ దృష్ట్యా కేవలం ద్విచక్రవాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. విజయవాడ వైపు వెళ్లే ఇతర వాహనాలన్నీ కనకదుర్గ వారధి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆదివారం వరకు ఇవే ఆంక్షలు కొనసాగతాయి.

Read More »