Breaking News
Home / Tag Archives: vijayawada (page 54)

Tag Archives: vijayawada

బాల త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం

విజయవాడ: రెండో రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బెజవాడ కనకదుర్గమ్మ తొమ్మిది అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. రెండో రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ బాలత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే దర్శనానికి అనుమతిచ్చారు.

Read More »

ఇంద్రకీలాద్రిపై పులిహోర తయారీ కేంద్రంలో నిర్లక్ష్యం

విజయవాడ: దేవాలయానికి వెళ్తే ఇచ్చే ప్రసాదాన్ని ఎంతో భక్తితో కళ్లకద్దుకుని తింటాం. దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం ఎంతో పవిత్రంగా భావిస్తాం. అదిపులిహోరకానీ, లడ్డూకానీ ఏదైనా దేవుడిపై భక్తితోనే వాటిని ఆరగిస్తాం. కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం తయారీలో నిర్లక్ష్యం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సాక్షాత్తూ దుర్గమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం తయారీ కేంద్ర అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఇంద్రకీలాద్రిలో పరిస్థితి ఎలా వుందో శనివారం స్పష్టమైంది. …

Read More »

ఏపీ బీజేపీలో భారీగా చేరికలు.. త్వరలో మరికొంత మంది..!

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు.. మరికొందరు నేతలు క్యూలో ఉన్నారని త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని కమలనాథులు మీడియా ముందుకొచ్చినప్పుడల్లా చెబుతున్నారు. అయితే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. వీరిలో కడప జిల్లా నేతలు, మైదుకూరు నియోజకవర్గ కాంగ్రెస్ …

Read More »

మూలానక్షత్రం రోజున అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రులకు సర్వం సిద్ధమైంది. ఫ్లైఓవర్ పనులు అడుగడుగునా ఆటంకం కలిగించినా ఎక్కడా రాజీ పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పండుగ కావడంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వీఐపీల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు. మూలానక్షత్రం రోజున అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆదివారం నుంచి అక్టోబర్ 8 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. …

Read More »