Breaking News
Home / Tag Archives: visakha gas leak

Tag Archives: visakha gas leak

విశాఖలో మళ్లీ విషవాయువు కలకలం

విశాఖ: ఎల్జి పాలిమర్స్ ఘటన మరువకముందే విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌లో విషవాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కంపెనీలో షిఫ్ట్ ఇన్ చార్జ్ రాగి నాయుడు, కెమిస్ట్ గౌరీశంకర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. పరవాడలోని ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, …

Read More »

విశాఖ ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య…

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. స్టెరిన్ గ్యాస్ ప్రభావంతో యలమంచలి కనకరాజు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజులు చికిత్స పొందిన కనకరాజు ఆరోగ్యం బాగానే ఉండటంతో ఇంటికి వెళ్లిపోయాడు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురవడంతో కనకరాజు మృతి చెందాడు. కాగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వల్లనే మృతి చెందాడని కనకరాజు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చికిత్స అనంతరం ఒక్కొక్కరిగా మృతి చెందుతుండటంతో  …

Read More »

ఏపీలో మరో గ్యాస్ లీకేజ్ కలకలం…

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన సృష్టించిన మారణ హోమం ఇంకా ఆరనే లేదు. ఆరోజు నుండీ ఏపీ ప్రజలు గ్యాస్ లీకేజీ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. అది తల్చుకుంటేనే ఇప్పటికి ప్రజలకు నిద్ర కరువవుతోంది. అయినా సరే తరచూ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట గ్యాస్ లీకేజ్ లు అవుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ …

Read More »

ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు

విశాఖ : విశాఖ LG పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల ప్రజలందరికీ ఆర్థిక సాయం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బాధిత గ్రామాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ రూ.10వేల చొప్పున అందించనున్నారు. నేటి నుంచి డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుండగా, గ్రామాల్లో ఉన్న పిల్లలు, పెద్దలు అందరినీ లెక్కలోకి తీసుకోనున్నారు. ఇంటి యజమాని బ్యాంకు ఖాతాలో ఈ ఆర్థిక సాయం జమ …

Read More »

కేజీహెచ్ వద్ద గ్యాస్ లీక్ బాధితులు ఆందోళన…

విశాఖపట్టణంలోని గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరోగ్యం మెరుగుపడకుండానే తమను డిశ్చార్జి చేస్తున్నారని కేజీహెచ్ లో చికిత్స పొందుతన్న బాధితులు ఆరోపిస్తు నిరసనకు దిగారు. ఇంకా అనారోగ్యంగానే ఉన్న తమను ఎలా డిశ్చార్జి చేస్తారు? ఈ పరిస్థితుల్లో తిరిగి మా గ్రామాలకు ఎలా వెళ్లాలి? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అందించే డబ్బులు తమకు వద్దని, సంపూర్ణ ఆరోగ్యంతో తమను ఇళ్లకు పంపించాలని కోరుతున్నారు.

Read More »

గ్యాస్ లీక్ ప్రమాదంపై అనేక అనుమానాలు…

అమరావతి: ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ ప్రమాదంపై అనేక అనుమానాలున్నాయని జనసేనాని పవన్‌కల్యాణ్‌ సందేహం వ్యక్తం చేశారు. రసాయనశాస్త్ర నిపుణులు పలు అంశాలు తన దృష్టికి తెచ్చారని, ట్యాంక్ ఉష్ణోగ్రతలు లాక్‌డౌన్ సమయంలో ఎందుకు పర్యవేక్షించలేదని ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు సైరన్ ఎందుకు మోగలేదని నిలదీశారు. యాజమాన్యం ప్రజలను ఎందుకు అప్రమత్తం చెయ్యలేదని, ట్యాంక్ పేలకుండా బ్రీథర్ వాల్వ్ తెరిచింది వాస్తవమేనా? అని ప్రశ్నించారు. మొత్తం 24 ఆంశాలలో లోతైన …

Read More »

మూడు రోజుల్లో ఆర్థిక సాయం అందించాలి…

అమరావతి : విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన తదనంతర పరిణామాలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్యాస్‌ లీకేజీ ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆళ్లనాని, సీఎస్‌, డీజీపీ.. విశాఖ నుంచి మంత్రులు బొత్స, అవంతి, కన్నబాబు, అధికారులు పాల్గొన్నారు. సహాయక చర్యలు, పరిహారంపై మంత్రులు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. మంత్రులంతా ఐదు గ్రామాల్లో …

Read More »

విశాఖ గ్యాస్ లీక్ ప్రాంతంలో బస చేస్తాం…

విశాఖపట్నం: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఆరు కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభించామని మంత్రి కన్నబాబు తెలిపారు. నిపుణుల సూచన మేరకు ఈరోజు సాయంత్రం నుంచి స్థానికులను గ్రామాలకు తరలిస్తామన్నారు. క్షతగాత్రులకు, స్థానికులకు భరోసా కల్పించేందుకు ఈరోజు రాత్రి కొంతమంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో బస చేయనున్నట్లు తెలిపారు. రేపటి నుండి క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం …

Read More »

పోలీసుల ఆరోగ్యం నిలకడగా ఉంది…

విశాఖ: ఏడుగురు పోలీసుల ఆరోగ్యం నిలకడగా ఉందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఎంతో శ్రమించారని, ప్రజల రక్షణలో పడి వారి రక్షణ మర్చిపోయారని కొనియాడారు. కేర్‌ ఆస్పత్రిని డీజీపీ సందర్శించారు. కేర్‌లో చికిత్స పొందుతున్న ఏడుగురు పోలీసులకు ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వీరికి రివార్డులు ప్రకటిస్తామని సీఎం జగన్‌ అన్నారని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

Read More »

విశాఖలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి

అమరావతి: విశాఖ గ్యాస్ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 48 గంటలు దాటితే సాధారణ పరిస్థితులు అక్కడ నెలకొంటాయన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చుట్టుపక్కల ఐదు గ్రామాలలో బాధితులను గుర్తించేందుకు డోర్ టూ డోర్ సర్వే చేస్తామని మంత్రి గౌతంరెడ్డి తెలిపారు.

Read More »