Breaking News
Home / Tag Archives: visakhapatnam

Tag Archives: visakhapatnam

పూర్తిగా విస్తరించిన నైరుతి

విశాఖపట్నం: దేశంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. సాధారణంగా జూలై 15కల్లా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఈ ఏడాది నాలుగు రోజుల ఆలస్యమైంది. కాగా ఈ ఏడాది జూన్‌ 8న కేరళలో రుతుపవనాలు వారం ఆలస్యంగా ప్రవేశించాయి. తరువాత అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావంతో 10- 15 రోజుల పాటు వాటి విస్తరణ నిలిచిపోయింది. దీంతో జూన్‌లో దేశంలో …

Read More »

రెండు రోజుల్లో అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం

విశాఖపట్నం: కొద్దిరోజులుగా ఉత్తరాదిలో తిష్ఠ వేసిన తూర్పు, పడమర ద్రోణి తూర్పు భాగం వాయువ్య బంగాళాఖాతానికి చేరింది. ఇదే సమయంలో అరేబియా సముద్రంలో రుతుపవన కరెంట్‌ ప్రభావంతో పడమర గాలులు వీస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో బుధవారం ఒడిసా, బెంగాల్‌కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు బలపడి రాష్ట్రంలో వర్షాల జోరు పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెల 23 …

Read More »

సింహాచలంలో గిరిప్రదక్షిణకు పోట్టెత్తిన భక్తజనం

విశాఖ: సింహాచలంలో గిరిప్రదక్షిణకు భారీగా భక్తులు వస్తున్నారు. గిరిప్రదక్షిణ 32 కిలోమీటర్లు కొనసాగుతోంది. తొలి పావంచా దగ్గర పండితులు ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ కుమార్తె అదితి పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ జరిగే ప్రాంతాల్లో వాహన రాకపోకలపై పూర్తిగా ఆంక్షలు విధించారు. 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read More »

మలేషియాలో విశాఖ వాసి మృతి

విశాఖ: మలేషియాలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి మృతి చెందడం కలకలం రేపుతోంది. విశాఖలోని గాజువాక టీవీఎన్ కాలనీకి చెందిన సూర్యనారాయణ కొంత కాలం క్రితం విజిటింగ్ వీసాతో మలేషియా వెళ్లాడు. విజిటింగ్ వీసా గడువు పూర్తయినా కూడా ఇండియాకు రాకుండా వేరొక కంపెనీలో పని చేస్తూ సూర్యనారాయణ అక్కడే ఉండిపోయాడు. అయితే తాజాగా ఆయన బాత్‌రూంలో ప్రమాదవశాత్తు కాలు జారడంతో పడిపోయి మృతి చెందాడు.

Read More »

విశాఖ బీచ్‌కి వెళ్తే కోణార్క్ వీల్ చూడొచ్చు

విశాఖ: కోణార్క్ వీల్ చూశారా? చూడలేదా? అయితే కోణార్క్ వెళ్లనవసరంలేదు. విశాఖ ఆర్కే బీచ్‌కు వస్తే చూడవచ్చు. ఇప్పుడు విశాఖ పర్యాటకులకు ఈ చక్రం ఒక ప్రత్యేకతగా మారింది. సూర్యదేవాలయంలో ఉన్న చక్రంకు ఓ ప్రత్యేకత ఉంది. కోణార్క్ సూర్యదేవాలయంలో మొత్తం 24 చక్రాలు ఉంటాయి. అవి రోజుకు సంకేతం. ప్రతి చక్రంలో 8 పులులు ఉంటాయి. ఒక్కోక్కటి మూడు దశలను వివరిస్తుందని అందులోని ప్రత్యేకత. ఆ చక్రం 9.9 …

Read More »

విశాఖకు ‘ఉప్పు’ముప్పు

విశాఖకు ఉప్పుముప్పు ఇష్టానుసారంగా బోర్ల తవ్వకాలతో మంచినీటిలోకి సముద్ర జలాలు తీరప్రాంతాల్లో ఊరుతున్న ఉప్పు 300 అ. వేసినా పడని తాగునీరు పలుచోట్ల భారీగా లవణసాంద్రత పరిమితికి మించి వాడుకే కారణం మేల్కొనకపోతే ‘చెన్నై’ పరిస్థితే పర్యావరణ నిపుణుల హెచ్చరిక విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్‌రోడ్డుకు ఆనుకుని కలెక్టరేట్‌ డౌన్‌లో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రి యజమాని గత నెలలో 130 అడుగులలోతు బోరు తవ్వించాడు. బోరు నుంచి ఉప్పు …

Read More »

తిరుపతి విమానం రద్దుపై ఢిల్లీలో చర్చలు

పరిశీలిస్తామని ఎయిర్‌ ఇండియా సీఎండీ హామీ హైదరాబాద్‌-విజయవాడ-విశాఖ విమానం నడపడానికి అంగీకారం విశాఖపట్నం: విశాఖపట్నం-విజయవాడ-తిరుపతి మధ్య ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అలయెన్స్‌ ఎయిర్‌ నడుపుతున్న విమానాన్ని ఈ నెల 16 నుంచి రద్దు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దానిని కొనసాగించాలని కోరుతూ ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఎయిర్‌ ఇండియా స్వతంత్ర డైరెక్టర్‌ దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి ఎయిర్‌ ఇండియా సీఎండీ అశ్వని …

Read More »

బంగాళాఖాతంలో అల్పపీడనం

కోస్తాకు భారీ వర్షసూచన 2న తెలంగాణలో అతిభారీ వర్షాలు తీరం వెంబడి బలమైన గాలులు మత్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దు: ఐఎండీ విశాఖపట్నం/కర్నూలు: ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి రుతుపవనాల విస్తరణకు, వర్షాలు పెరిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా ఆ తరువాత వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఆదివారం ఒడిసాలో …

Read More »

విశాఖ టీడీపీ కార్యాలయానికి నోటీసులు

విశాఖ : విశాఖ టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీలు జారీ చేశారు. ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు వారం రోజులుగా ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై టీడీపీ నగర అధ్యక్షుడు రెహమాన్ స్పందిస్తూ.. పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని 2001 లో ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నామని, అప్పటి నుంచి ప్రతీ ఏడాది లీజ్‌ను ప్రభుత్వానికి కడుతూనే ఉన్నామని స్పష్టం చేశారు. …

Read More »

30న ఏపీ స్పెషల్‌ డీఎస్సీ-2019

విశాఖ: ఏపీ స్పెషల్‌ డీఎస్సీ-2019 (కంప్యూటర్‌ బేస్డ్‌) 30వ తేదీ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకూ నిర్వహించనున్నట్టు డీఈవో లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఐఓఎన్‌ డిజిటల్‌ జోన్‌ను షీలా నగర్‌ నుంచి చినముషిడివాడకు మార్చినట్టు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభపు సమయం కంటే గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలన్నారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన లోపలకు అనుమతించరన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన …

Read More »