Breaking News
Home / Tag Archives: vishalandra former editor died

Tag Archives: vishalandra former editor died

ప్రజా శ్రేయస్సుకోసం కష్టపడిన వ్యక్తి…

అమరావతి: ప్రముఖ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. రాఘవాచారి తన తుదిశ్వాస వరకూ సిద్ధాంతాలు, విలువలే శ్వాసగా బతికారని కొనియాడారు. రాఘవాచారి పత్రికా విలువలకు కట్టుబడి ప్రజా శ్రేయస్సు కోసం కష్టపడిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఎంతో మంది జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచిన రాఘవాచారి మరణం పత్రికా రంగానికి తీరని లోటు …

Read More »

ఆయన మరణం బాధాకరం….

అమరావతి: విశాలాంధ్ర పూర్వ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ‘‘మూడు దశాబ్దాల పాటు విశాలాంధ్ర పత్రిక ప్రధాన సంపాదకులుగా సేవలందించిన చక్రవర్తుల రాఘవాచారి మరణం బాధాకరం.. జర్నలిజంతో సమాజానికి సేవలు అందించిన రాఘవాచారి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని కన్నా ట్వీట్ చేశారు.

Read More »

రాఘవాచారి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి…

హైదరాబాద్: సీనియర్ సంపాదకుడు, సామాజిక ఉద్యమకారుడు రాఘవాచారి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. నిబద్ధత కలిగిన జర్నలిస్ట్‌గా, విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా ఆయన సాగించిన జీవితం ఆదర్శ ప్రాయం అన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ సానుభూతి తెలిపారు.

Read More »

రాఘవాచారి మృతి పట్ల బాబు సంతాపం…

అమరావతి: సీనియర్ పాత్రికేయులు, మార్క్సిస్టు మేధావి రాఘవాచారి మృతి పట్ల టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. విశాలాంధ్ర మాజీ సంపాదకులుగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం రాఘవాచారి జీవితాంతం కట్టుబడి ఉన్నారన్నారు. నిరుపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పని చేశారని చంద్రబాబు కొనియాడారు. పూర్తి నిబద్దతతో తన వృత్తిలో రాణించారని.. సమకాలీన పాత్రికేయులకు ఆదర్శంగా, భావి తరాలకు మార్గదర్శంగా …

Read More »

ఆయన రచనలు యువ తరాలకు ప్రేరణ….

అమరావతి: సీనియర్ పాత్రికేయులు, మార్క్సిస్టు మేధావి రాఘవాచారి మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రాఘవాచారి ఆధారిత జర్నలిజాన్ని విశ్వసించారని జగన్ కొనియాడారు. రాఘవాచారి రచనలలో విలువ ఆధారిత జర్నలిజం ప్రతిబింబిస్తుందని.. ఆయన రచనలు యువ తరాలకు ప్రేరణగా నిలిచాయని జగన్ పేర్కొన్నారు.

Read More »

విశాలాంధ్ర మాజీ ఎడిటర్ కన్నుమూత….

విజయవాడ : గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ప్రముఖ పాత్రికేయుడు, విశాలాంధ్ర దినపత్రిక మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మరికాసేపట్లో ఆయన భౌతికకాయాన్ని మగ్దూం భవన్‌కు తరలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడ విశాలాంధ్ర కార్యాలయానికి తరలిస్తారు.

Read More »