Breaking News
Home / Tag Archives: wall collapse

Tag Archives: wall collapse

ఉమెన్స్‌ హాస్టల్‌లో తప్పిన పెను ప్రమాదం!

మాదాపూర్‌:మాదాపూర్‌లోని పత్రికానగర్‌లో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఒక్కసారిగా సెల్లార్‌ పక్కనే ఉన్న గది గోడ కూలడంతో హాస్టల్‌లో ఉన్న వారందరూ భయభ్రాంతులకు గురయ్యారు. పత్రికానగర్‌లో సాయిసంగమేశ్వర హాస్టల్‌ను నెల్లూరు జిల్లా పంగం గ్రామానికి చెందిన శ్రీహరి అనే వ్యక్తి తల్లితో కలిసి మూడేళ్లుగా పీజీ ఉమెన్స్‌ హాస్టల్‌ను నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా హాస్టల్‌ పక్కనే భవన నిర్మాణం చేసేందుకు సెల్లార్‌ను తీస్తున్నారు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు …

Read More »

హబీబ్‌నగర్‌లో విషాదం

హైదరాబాద్: ఇంటి మధ్య గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడిన సంఘటన గురువారం రాత్రి నగరంలోని హబీబ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అఫ్జల్‌సాగర్‌ మాన్గార్‌ బస్తీలో రోజు కూలితో పొట్టపోసుకునే మిఠాయి లాల్, సీమ దంపతులు తమకున్న ఆదాయ వనరులతో పునాదులు లేకుండా సిమెంట్‌ ఇటుకలతో చిన్న శ్లాబ్‌ ఇల్లు నిర్మించుకున్నారు. అదే ఇంట్లో …

Read More »

ఇంటి గోడ కూలి ఇద్దరు మృతి…

పశ్చిమ గోదావరి: ఏలూరులోని ఉంగుటూరు మండలం నారాయణపురంలో విషాదం చోటుచేసుకుంది. వర్షాలకు ఇంటి గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. మృతులు సిరవరపు శ్రీను (40) పెద్దిరెడ్డి రాఘవమ్మా (60)గా గుర్తించారు.

Read More »

గోడ కూలడంతో రైతు మృతి…

కడప: వర్షానికి తడిసి గోడ కూలడంతో రైతు మృతి చెందిన ఘటన సోమవారం పులివెందులలో చోటు చేసుకుంది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని ఓ ఇంటి గోడ వర్షానికి తడిసి, ఈరోజు ఉదయం 5.20 గంటలకు కూలడంతో.. కేశవరెడ్డి మహేష్‌ రెడ్డి (35) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

Read More »

గోడ కూలి చిన్నారులు మృతి…

పంజాబ్‌: గోడ కూలిన ఘటనలో అయిదుగురు చనిపోయారు. ప్రాణాలు కోల్పోయినవారిలో చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని అంబాలా కంటోన్మెంట్‌లో జరిగింది. గోడ శిథిలాల కింద చిక్కుకుని చిన్నారులు మృతిచెందారు. అంబాలాలోని కింగ్ ప్యాలెస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పిల్లలు నిద్ర పోతున్న సమయంలో గోడ కూలినట్లు పోలీసులు వెల్లడించారు.

Read More »