Breaking News
Home / Tag Archives: ward sachivalayam

Tag Archives: ward sachivalayam

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలు – 2020

Click here for Grama ward Sachivalayam Results 2020 ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్తీ తర్వాత మిగిలి పోయిన ఖాళీలు, అలాగే ఉద్యోగాలు మానేసిన వారి స్ధానంలో ఖాళీ అయిన ఉద్యోగాల కోసం సెప్టెంబర్లో ప్రభుత్వం మరోసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,208 పోస్టులకు ఈ పరీక్షలు …

Read More »

కరోనాపై ఇంటింటి సర్వే

ఏపీ: కరోనా వైరస్‌ ప్రబలకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. అందులో భాగంగా గ్రామ/వార్డు వాలంటీర్లు, ఏఎన్‌ఎంలతో మొబైల్ యాప్ ద్వారా నేడు, రేపు ఇంటింటి సర్వే చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా? వారికి దగ్గు, జలుబు లాంటివి ఉన్నాయా? అనే వివరాలు తెలుసుకోనుంది. అటు కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులను శుభ్రం చేయాలని అధికారులు నిర్ణయించారు.

Read More »

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే బాధ్యతలు వారికే

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఇకపై గ్రామ, పట్టణ వలంటీర్లు రంగంలోకి దిగనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను గ్రామ వలంటీర్ల ద్వారా సేకరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ, పట్టణ వలంటీరు ఉంటారు కాబట్టి విదేశాల నుంచి ఆయా గ్రామాలకు వచ్చిన వారిని తేలిగ్గా గుర్తించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 10 తర్వాత విదేశాలకు వెళ్లి వచ్చిన వారుగానీ, …

Read More »

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీపికబురు

అమరావతి: కాస్ట్(కుల ధృవీకరణ) సర్టిఫికెట్లు కావాలంటే ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిందే. ఇకపై ఈ సమస్యకు చెక్ పెట్టేలా.. గ్రామ/వార్డు సచివాలయాల్లోనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇతర రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ అవసరాల కోసం ఇచ్చే సర్టిఫికెట్లను మాత్రం తహశీల్దార్, ఆపైన ఉండే అధికారి మంజూరు చేయనుండగా.. మార్చి నెలాఖరు నుంచి ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

Read More »

వేతనాలను తిరిగి చెల్లిస్తేనే రాజీనామా…

అమరావతి: గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు మెరుగైన ఉద్యోగం వస్తే, దీన్ని వదిలి వెళ్లడం అంత తేలిక కాదు. శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాలను తిరిగి చెల్లిస్తేనే రాజీనామా ఆమోదిస్తారు. లేదంటే మెరుగైన ఉద్యోగం వదులుకోవాల్సిందే. సచివాలయాల్లో పీజీ, యూజీ చేసిన వారు ఎక్కువగా విధుల్లో ఉండగా… వీరిలో పలువురు రైల్వే, బ్యాంకింగ్ ఉద్యోగాలకు వెళ్లాలనుకోవడంతో వేతనాలు తిరిగి చెల్లించాలని అధికారులు చెప్పారు.

Read More »

మీకు రేషన్ కార్డు కావాలా?

ఏపీలో కొత్త బియ్యం(రేషన్) కార్డుల పంపిణీ ప్రారంభం కాగా.. 18 లక్షల రేషన్ కార్డులను అనర్హులకు చెందినవిగా గుర్తించారు. వీరిలో కూడా పలువురు అర్హులు ఉండగా.. అలాంటి వారు గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేస్తే ఐదు రోజుల్లో రేషన్ కార్డు మంజూరు చేస్తామని మంత్రి కొడాలి నాని చెప్పారు. రేషన్ కార్డు రాలేదని ఆందోళన చెందవద్దని.. పెన్షన్ రాని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే 2 నెలల పెన్షన్ మార్చిలో …

Read More »

‘స్పందించకపోతే వారిది అరణ్యరోదనే అవుతుంది’

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని.. ఈ వ్యవస్థలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని వివిధ వర్గాల …

Read More »

4.27 లక్షల పెన్షన్లు తొలగించాం

ఏపీలో అర్హత లేని 4.27లక్షల పెన్షన్లను తొలగించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఫిబ్రవరి 1 నుంచి కొత్తగా 6.11 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామని.. పెన్షన్ అందని లబ్ధిదారులు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులు ఉంటే ఐదు రోజుల్లో పెన్షన్ మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Read More »

కోర్టు అంటే లెక్కలేదా?

ఆంధ్రప్రదేశ్: మీ సేవ కేంద్రాల్లో అందించే సేవలను గ్రామ/వార్డు సచివాలయల్లో అందించేలా ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేసింది. తమ జీవనాధారం దెబ్బతిసేలా ఈ జీవో ఉందని మీసేవ ఆపరేటర్లు కోర్టుకు విన్నవించుకోగా.. దీనిపై వివరణకు సమయం కావాలని ఏపి ప్రభుత్వం కోర్టును కోరింది. దీంతో గతంలో గడువిచ్చినా స్పందనలేదని.. కోర్టు అంటే లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారని జడ్జి ఆగ్రహించారు.

Read More »

ఏపీలోని సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరిరోజు

ఏపీలోని సచివాలయాల్లో 16,207 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే అంటే జనవరి 31 చివరిరోజు .. గ్రామ సచివాలయ పోస్టులు 14,061, వార్డు సచివాలయ పోస్టులు 2,146 ఉన్నాయి . మొత్తం ఖాళీల సంఖ్య 16,207. జనవరి 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది . జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది . జనవరి 31 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు …

Read More »