Breaking News
Home / Tag Archives: West godavari

Tag Archives: West godavari

పశ్చిమగోదావరి జిల్లాలో గ్యాస్‌ లీకేజీ….

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్‌ లీకేజీ కావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఆచంట మండలం వేమవరంలో బోర్‌కు మరమ్మత్తులు చేస్తుండగా గ్యాస్‌ లీకేజీ అయింది. శబ్ధంతో గ్యాస్‌ లీకేజీ కావడంతో అధికారులు గ్రామస్థులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Read More »

పశ్చిమగోదావరి జిల్లాలో 7 కరోనా కేసులు…

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పెదపాడు మండలం తోటగూడెంలో మూడు, తణుకు పైడిపర్రు, పోలవరం ఒక కేసు, ఆకివీడు మండలం గుమ్ములూరు, ఏలూరు కుండీ సెంటర్ వద్ద ఒక్కో కేసు నమోదు అయ్యాయి. కొత్తగా కేసులు నమోదు అవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏలూరు కుండీ సెంటర్, గుమ్ములూరు, పైడిపర్రు, పోలవరంలలో కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.

Read More »

పోలీసులపై 300 మంది కూలీలు దాడి..

లాక్‌డౌన్‌ సడలింపు నేటి నుంచి అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోలీసులపై వలసకూలీలు దాడికి పాల్పడడం కలకలం రేపింది. పోలీసులపై రాళ్లు, సీసాలతో వలస కూలీలు దాడి చేశారు. దీంతో లాఠీచార్జి చేసిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ రాష్ట్రాలకు తమను తిరిగి పంపాలంటూ దాదాపు 300 …

Read More »

సచివాలయ ఉద్యోగికి కరోనా…

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ర్యాపిడ్ టెస్టుతో అతడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. ఈ విషయాన్ని మండల అధికారులు ధృవీకరించారు. వెంటనే కరోనా బాధితుడిని ఏలూరు కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృభిస్తోంది. నిన్న ఒక్కరోజే 71 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403కు …

Read More »

రేపటి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

కాకినాడ: పశ్చిమగోదావరి జిల్లాలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. రేపటి నుంచి సముద్రంలో చేపలు పట్టడంపై ఆంక్షలు విధించింది. దాదాపు 61రోజుల పాటు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. చేపల వేట విరామ సమయంలో ఒక్కో మత్స్యకారునికి ప్రభుత్వం నెలకు రూ.5వేల నగదు ఇవ్వనుంది.

Read More »

ఇకపై జిల్లాలోనే కరోనా పరీక్షలు

కాకినాడ: కరోనా ప్రాథమిక నిర్ధారణ పరీక్షలను ఇక నుంచి జిల్లాలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏలూరు మెడికల్ కాలేజ్‌లో అధికారులు ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో ప్రతీ రోజు 200 నమూనాలను పరీక్షించనున్నారు.

Read More »

ఏలూరులో మరో కరోనా అనుమానిత కేసు

ఏలూరు: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. కృష్ణా జిల్లా కైకలూరు వద్ద ఆచవరానికి చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్టు వైద్యులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం సదరు అనుమానితుడు హైదరాబాద్‌కి వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఏలూరు గవర్నమెంటు హాస్పటల్‌లో ఐసోలేషన్ వార్డులో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.

Read More »

పోలవరం వ్యయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఏపీ: పోలవరం ప్రాజెక్టు భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,545 కోట్లు కాగా, రూ.48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.16వేల కోట్లు ఖర్చు చేసింది. మిగతా రూ.32 వేల కోట్లనూ భరించేందుకు తాజాగా ఓకే చెప్పింది. ఆడిటింగ్ పూర్తవ్వగానే కేంద్రం నుంచి ఈ నిధులు విడుదల కానున్నాయి.

Read More »

స్థానికంలోనూ ‘నోటా’

ఏలూరు: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో నోటాకు చోటు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాలెట్‌ పత్రాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇది పెద్ద తలనొప్పేనని నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నోటాకు కొన్ని ప్రధాన పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు రావడమే దీనికి కారణం. ఇప్పటివరకు ఈవీఎంలలో మాత్రమే నోటాకు …

Read More »

ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు

ఆంధ్రప్రదేశ్: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించి గురువారానికి పది సంవత్సవరాలు అవుతోంది. ఈ సందర్భంగా అన్ని జిల్లాలలోని పార్టీ కార్యాలయాల్లో వేడకలు నిర్వహించారు. కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు జరిపారు. పార్టీ జెండాను ఎగురవేసిన నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, …

Read More »