Breaking News
Home / Tag Archives: womens dharna

Tag Archives: womens dharna

మద్యం షాపు రద్దు చేయాలని మహిళల ఆందోళన…

తిరుపతి : శ్రీసిటీ పరిధిలోని ఆరూరులో ప్రభుత్వ మద్యం షాపు వద్ద శనివారం మహిళలు బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ మద్యం షాపును రద్దు చేయాలని గత నెల రోజులుగా అక్కడి గ్రామ పెద్దలు ప్రభుత్వాన్ని కోరారు. నాలుగు రోజులుగా ఆరూరులో షాపు మూత పడడం జరిగింది. అయితే శనివారం మళ్లీ మద్యం షాపు తెరవడంతో మహిళలు ఒక్కసారిగా షాపు వద్దకు వచ్చి అక్కడే కూర్చొని నిరసన కొనసాగిస్తున్నారు. …

Read More »

బ్రాందీ షాపు ఎత్తివేయాలంటూ… విన్నూత నిరసన….

పశ్చిమ గోదావరి : బ్రాందీ షాపును ఎత్తేయాలంటూ.. ఐద్వా ఆధ్వర్యంలో ఆలమూరు మహిళలు శనివారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పెనుమంట్ర మండలం ఆలమూరు పరిధిలోని కొయ్యేటిపాడు రోడ్డులో ఉన్న ప్రభుత్వ బ్రాంది షాపును ఎత్తి వేయాలంటూ.. గత నాలుగు రోజులుగా ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక మహిళలు చేపట్టిన నిరసన నేటితో అయిదో రోజుకు చేరింది. అయిదో రోజున వినూత్న రీతిలో గడ్డిపరకలను తింటూ.. మహిళలు నిరసన వ్యక్తపరిచారు.

Read More »

మద్యం దుకాణం సరుకులను తక్షణమే తీసేయాలి….

పశ్చిమ గోదావరి : ఆలమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం సరుకులను తక్షణమే తీసివేయాలంటూ.. ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక మహిళలతో కలిసి పెనుమంట్ర మండలంలో ధర్నా నిర్వహించారు. పెనుమంట్ర మండలం ఆలమూరులోని కొయ్యేటిపాడు రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం సరుకులను తక్షణమే తీసివేయాలంటూ.. ఐద్వా జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి డిమాండ్‌ చేశారు.

Read More »

రెండో రోజుకు చేరుకున్న మహిళల నిరాహార దీక్ష…

తూర్పు గోదావరి: జగ్గంపేటలోని ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం వద్దంటూ ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్‌ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు చేపట్టిన రిలే నిరాహారదీక్ష మంగళవారంతో రెండో రోజుకు చేరింది. జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న బ్రాందీ షాపును నిలిపివేయాలని రెండవ రోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తక్షణం ఆబ్కారీ అధికారులు వచ్చి మద్యం షాపును రద్దు చేస్తామని హామీ ఇచ్చేవరకూ …

Read More »