Breaking News
Home / Tag Archives: ycp

Tag Archives: ycp

కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌

వైకాపా నేత మోకా భాస్కర్‌రావు హత్యకేసులో అరెస్టయిన మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్‌ ముందుహాజరు పరిచారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. …

Read More »

భూవివాదంలో బెజ‌వాడ వైసీపీ నేత‌.. బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు

ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు విజయవాడ వైసీపీ నేత పీవీపీ. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని భూమి విషయంలో తనపై పీవీపీ, అతని అనుచరులు దాడి చేశారంటూ బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసుల‌ను ఆశ్రయించాడు. అయితే స్థలానికి సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని అంటున్నారు పీవీపీ. ఓ నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రస్తుతం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పీవీపీ, అతనిపై ఫిర్యాదు చేసిన కైలాష్‌ …

Read More »

రేపు రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

అమరావతి: రేపు రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల బరిలో వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు నిలవనున్నారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటు ఎలా వేయాలో శాసనసభ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చూపించనున్నారు. వైసీపీ నుంచి బరిలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని.. టీడీపీ …

Read More »

విశాఖలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ

విశాఖ: తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబును వైసీపీ శ్రేణులు అడ్డుకుని దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. రామకృష్ణపురంలో పలు అభివృద్ధిపనుల శంకుస్థాపనకు వెళ్లిన సమయంలో వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే వెలగపూడిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు …

Read More »

వడ్డీతో సహా ఇంతకింత చెల్లిస్తాం జాగ్రత్త

దశాబ్దాలుగా టీడీపీలో పదవులు పొందినవాళ్లు.. ఇప్పుడు వేదింపులకు భయపడి పార్టీ మారుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బెదిరింపులకో, ప్రలోభాలకో భయపడి పార్టీ మారడం పిరికితనమని చంద్రబాబు అన్నారు. ఒకరు పోతే వంద మందిని తయారుచేయగల సత్తా ఉందన్న ఆయన.. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినా ఏమీ కాదన్నారు. పార్టీ మారినవారంతా కనుమరుగైన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాబోయే …

Read More »

వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిద్దా

ప్రకాశం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరారు. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు శిద్దా రాఘవరావు తాడేపల్లి రాగా అక్కడ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. శిద్దా రాఘవరావుతో పాటూ ఆయన కుమారుడు శిద్దా సుధీర్ కూడా వైసీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శిద్దా రాఘవరావు …

Read More »

ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణల పై స్పందించిన అఖిలప్రియ

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డలో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏవీ సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. ఏవీ సుబ్బారెడ్డి కి మాకు వ్యక్తిగతంగా కొద్దిగా విభేదాలు ఉండటం వల్ల హత్య కుట్ర అంటూ మాపై నిందలు వేస్తున్నారని అనుకున్నామనీ కానీ నా భర్త భార్గవ్ రామ్ కు నోటీసులు వచ్చేసరికి కేసు మా వైపు మళ్ళుతుందని ముందస్తు బెయిల్ కు అప్లై చేశామని …

Read More »

చౌకగా సిమెంట్‌..

అమరావతి: పేదలకు ఇళ్ల నిర్మాణం సహా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ పనులు, పోలవరం ప్రాజెక్టు అవసరాల కోసం తక్కువ ధరకే సిమెంట్‌ సరఫరా చేసేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రజావసరాల దృష్ట్యా సిమెంట్‌ ధర తగ్గించుకొని సరఫరా చేసేందుకు అంగీకరించాయి. ఐదేళ్ల క్రితం చంద్రబాబు సర్కారు హయాంలో సరఫరా చేసిన ధర కంటే తక్కువ రేటుకే ఇప్పుడు సిమెంట్‌ అందచేసేందుకు కంపెనీలు …

Read More »

ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైసీపీదే విజయం

విజయవాడ: కరోనా వైరస్‌ దృష్యా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాలు వాయిదా వేస్తే దీనిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బహిరంగ సభలు, ర్యాలీలు పెట్టడం ద్వారా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే చంద్రబాబు ఎల్లో మీడియా మాత్రం ఎవరికో కంప్లైట్‌ …

Read More »

ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

విజయవాడ: నగరంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. శుక్రవారం విజయవాడ ఆర్వో కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు నామినేషన్లు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తమపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారని వారు తెలిపారు.

Read More »