Breaking News
Home / Tag Archives: young man died

Tag Archives: young man died

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి…

సంగారెడ్డి: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో విద్యుత్ షాక్‌తో సాయిరాం(22) అనే యువకుడు మృతి చెందాడు. ఉదయం నీటిని తోడటానికి ఉపయోగించే మోటార్ ఆన్ చేయడానికి వెళ్లడంతో షాక్ కొట్టి సాయిరాం అక్కడికక్కడే మృతి చెందాడు.

Read More »

అమీర్‌పేట్ క్రాస్ రోడ్స్ వద్ద ప్రమాదం…

హైదరాబాద్: నేటి తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట క్రాస్ రోడ్స్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్నఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

బ్రిడ్జి పై నుంచి పడి యువకుడు మృతి…

రాజన్న సిరిసిల్ల: బ్రిడ్జిపై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక బ్రిడ్జిపై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌కి చెందిన రాజశేఖర్ (20) గా గుర్తించారు. స్నేహితులతో కలిసి రాజన్న గుడికి వచ్చిన రాజశేఖర్.. ఇలా బ్రిడ్జిపై నుంచి పడి మృతి చెందడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యనా లేకా హత్యా? …

Read More »

నాగర్ కర్నూల్ లో రోడ్డు ప్రమాదం…

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లి గేట్ సమీపంలో బొలెరో- బైక్ ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాలకృష్ణ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read More »

స్నానానికి వెళ్లి శవమై తేలిన యువకుడు….

సరుబుజ్జిలి: లావేరు మండలం చిన్నమురపాక గ్రామానికి చెందిన కింతలి మణికంఠ (21) అనే యువకుడు నందికొండ కాలనీలో ఉండే తన మామయ్య ముచ్చేటి వెంకన్న ఇంటికి దసరా పండుగ కోసమని మంగళవారం రాత్రి వచ్చాడు. బుధవారం ఉదయం తోటి యువకులతో కలిసి మండలంలోని సరుబుజ్జిలి కూడలికి సమీపంలో ఉన్న వంశధార కుడి ప్రధాన కాల్వలో స్నానం చేసేందుకు వెళ్లగా ఈత కొడుతూ గల్లంతయ్యాడు. స్థానికులు మణికంఠ ఆచూకీ కోసం కాల్వలో …

Read More »

ప్రమాదవశాత్తూ కాలువలో పడి యువకుడు మృతి…..

జనగామ: జనగామ జిల్లాలోని లింగాల ఘనపురం మండలం నేలపోగులలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కాలకృత్యాలకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు దేవాదుల కాల్వలో జారిపడి మృతి చెందాడు. మృతుడు నేలపోగుల గ్రామానికి చెందిన ఉపేందర్‌(26)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

గుండెపోటుతో యువకుడు మృతి…

శ్రీకాకుళం: శనివారం టెక్కలిలోని భగవాన్‌పురం వద్ద మంచాల షణ్ముఖరావు (23)అనే యువకుడు రోడ్డుపై నడుస్తుండగా గుండెపోటు వచ్చి హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. యువకుడు ఇటీవల డిగ్రీ పూర్తి చేసుకొని టెక్కలిలో ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు.

Read More »