Breaking News
Home / Tag Archives: ysrcp

Tag Archives: ysrcp

ఈ నెల 24న టీడీపీలో చేరనున్న వంగవీటి రాధా!?

అమరావతి: వైసీపీ కీలకనేత, విజయవాడలో గట్టి పట్టున్న నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారు..? ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? అని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రాధా స్పష్టం చేశారు. అంత వరకూ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. సైకిలెక్కనున్న రాధా..!? ఇదిలా ఉంటే.. ఈనెల 24 లేదా ఆ తర్వాత వంగవీటి …

Read More »

ఉదయం వైసీపీలోకి.. మధ్యాహ్నానికి మళ్లీ టీడీపీలోకి..!

ఇటునుంచి అటు.. అటునుంచి ఇటు.. పాకాల/తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ మార్పిడి ప్రహసనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మండలంలోని ఉప్పరపల్లె పంచాయతీ అబ్బానాయుడు ఇండ్లుకు చెందిన టీడీపీ నాయకులు శేఖర్‌ నాయుడు, భూపాల్‌ నాయుడు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ పంచాయతీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పుకున్నారు. మధ్యాహ్నం తిరిగి ఆ పంచాయతీ టీడీపీ …

Read More »

ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం..

శ్రీకాకుళం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి వైఎస్సార్‌సీపీ నేత, శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్‌ సవాలు విసిరారు. అచ్చెన్నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టెక్కలి అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద ప్రజాసమక్షంలో తేల్చుకుందామని అన్నారు. అచ్చెన్నాయుడి రౌడీ రాజకీయాలు, అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని వాటి గురించి …

Read More »

అనంతలో ఉద్రిక్తత

అనంతపురం: నగరంలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ ఎమ్మెల్యే వి. ప్రభాకర్‌ చౌదరీ విసిరిన సవాల్‌ను స్వీకరించి చర్చకు బయలుదేరిన వెంకట్రామిరెడ్డిని పోలీసులు ఆయన ఇంటి వద్దనే అడ్డుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అనంతపురం నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలపై అనంత వెంకట్రామి రెడ్డి బహిరంగ చర్చకు సిద్దపడ్డారు. టీడీపీ ఎలాంటి అభివృద్ధి …

Read More »

‘త్వరలోనే వెలుగులోకి లోకేష్‌ బండారం’

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి వైఎస్సార్‌సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార‍్వతి మండిపడ్డారు. నెల్లూరులో లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు వల్ల నందమూరి కుటుంబం మరోసారి మోసపోయిందని అన్నారు. ఓడిపోతామని తెలిసే కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినిని టీడీపీ తరపున చంద్రబాబు పోటీలో నిలబెట్టారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో భారీగా దోపిడీ జరగుతోందన్నారు. రాజధాని, నీటి ప్రాజెక్టులలో అవినీతి ఏరులై …

Read More »

ఇప్పటికైనా సీబీఐ విచారణ చేయించాలి

విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరితే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సిట్‌ చేత విచారణ చేపట్టారని, కానీ సిట్‌ నిజాలు బయట పెట్టకుండా అధికార పార్టీకి అనుకూలంగా నివేదిక ఇచ్చిందని వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం నగర అధ్యక్షులు మళ్ల విజయ ప్రసాద్‌ తీవ్రంగా విమర్శించారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పటికైనా ప్రజల్ని మోసగించకుండా సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. భూకుంభకోణంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు …

Read More »

వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లక్ష్మీపార్వతి

తిరుమల: 2019 ఎన్నికల్లో పోటీపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరమల వెంకన్నను లక్ష్మీపార్వతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రానున్న ఎన్నికల్లో మీరు ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? అని మీడియా ప్రశ్నించగా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని లక్ష్మీ పార్వతి స్పష్టం …

Read More »

కుదిరితే వైసీపీలో లేకుంటే జనసేనలోకి..!?

వైసీపీ అసంతృప్తుల నోట కొత్తమాట రగులుతున్న పోలవరం రాజకీయం బాలరాజుపై కత్తులు దూస్తున్న మరోవర్గం ఫలించని సుబ్బారెడ్డి దౌత్యం జగన్‌ను కలిసేందుకే కొత్త వ్యూహం వింటే సరేసరి.. లేకుంటే పవన్‌వైపు ఏలూరు: ‘వైసీపీలో ఎవరైనా పదవులు పొందితే.. ఎన్నాళ్లు ఆ పదవుల్లో ఉంటారో వారికే తెలియదు. అంతా అధిష్టానం మహిమ. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటుందో మూడో కంటికి కూడా తెలియదు. అసలు ఏం చేయబోతున్నారో మాట వరస …

Read More »

శింగనమలలో ఉద్రిక్తత..జొన్నలగడ్డ అరెస్ట్‌

అనంతపురం జిల్లా: శింగనమల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నాలుగేళ్ల పాలన, టీడీపీ నేతల అవినీతిపై వైఎస్సార్‌సీపీ శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి బహిరంగ చర్చకు సవాల్‌ విసిరారు. టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యామినీబాలతో చర్చించేందుకు నార్పల గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జొన్నలగడ్డ పద్మావతిని ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పద్మావతి అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆందోళన నిర్వహించారు. మరోవైపు …

Read More »

దమ్ము, ధైర్యం ఉంటే అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయండి..: బొత్స

అశోక్‌, సుజయ్‌ చేసిన అభివృద్ధి ఏదీ? నాలుగేళ్లుగా ఏం చేశారో నిరూపించాలి కోలగట్ల విజయానికి సమష్టి కృషి వైసీపీ రాష్ట్రనేత బొత్స సత్యనారాయణ దాసన్నపేట/విజయనగరం: జిల్లా అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన బొబ్బిలి రాజులు ఇన్నేళ్లలో వారు ఏం అభివృద్ధి చేశారో నిరూపించాలని వైసీపీ రాష్ట్ర నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు. గురువారం వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ ఎమ్మెల్సీ కోల గట్ల వీరభద్రస్వామి …

Read More »