Breaking News
Home / National / రాష్ట్రీయ భజరంగ్ దళ్ నేతల హెచ్చరిక

రాష్ట్రీయ భజరంగ్ దళ్ నేతల హెచ్చరిక

ఆగ్రా : ఆగ్రాలోని పురాతన తాజ్‌మహల్ లో ముస్లిములు నమాజ్ చేయరాదని పురావస్తుశాఖ విధించిన నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన నేపథ్యంలో తాము కూడా పూజలు చేస్తామని రాష్ట్రీయ భజరంగ్ దళ్ నేతలు హెచ్చరించారు. తాజ్‌మహల్ లో గడచిన 400 ఏళ్లుగా తాము నమాజ్ చేస్తున్నామని తాజ్ మసీదు ఇంతేజామియా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం జైదీ చెప్పారు. కాగా శివుడి దేవాలయమైన తేజో మహాలయ ప్రదేశంలో నిర్మించిన తాజ్ మహల్ లో తాము కూడా పూజలు చేస్తామని రాష్ట్రీయ భజరంగ్ దళ్ నాయకుడు గోవింద్ పరాషర్ చెప్పారు. కొంతమంది నేతలు తాజ్‌మహల్ లో నమాజ్ చేయడాన్ని రాజకీయం చేస్తున్నారని దీనిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నాయని తమకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపిస్తామని జైదీ చెప్పారు.

Check Also

కన్నీరుపెట్టిస్తున్న ఓ అమర జవాను కథ…..

Share this on WhatsAppపుణె: వ్యాధితో బాధపడుతోందని తెలిసీ ప్రేమ వివాహం చేసుకుని ఓ యువతికి జీవితాన్ని ప్రసాదించాడు. ఎల్లప్పుడూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *