Breaking News
Home / Lifestyle / Astrology / దీపావళి నాడు గిఫ్టులలో ఈ వస్తువులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి.

దీపావళి నాడు గిఫ్టులలో ఈ వస్తువులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి.

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదైనా పండుగకూ లేదా ఇతర కార్యక్రమాలకు సంబంధించి చాలా మంది వారి స్నేహితులకు, బంధువులకు, ప్రేమికులకు బహుమతులు ఇస్తూ ఉంటారు, స్వీకరిస్తుంటారు. ఈ గిఫ్ట్ లు గురించి ఒకసారి పరిశీలిస్తే ఇది ప్రాచీన కాలం నుండి వచ్చిన సంప్రదాయం. మొదట్లో ఈ బహుమతులను కేవలం వివాహం మరియు పుట్టినరోజు, నామకరణం సందర్భాలలో మాత్రమే ఇచ్చేవారు.

కానీ ఆధునికత పెరిగిన ఈ కాలంలో చీటికి మాటికీ గిఫ్టులు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం సర్వసాధారణమైపోయింది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఏవి పడితే అవి బహుమతులుగా ఇవ్వకూడదట. ఎందుకంటే మీరు ఇచ్చే లేదా స్వీకరించే బహుమతులు ప్రేమ మరియు సంరక్షణ కోసమే పరిమితం కాదంట. అవి మన మానసిక స్థితిని బట్టి, సానుకూల మరియు ప్రతికూల శక్తిని కూడా మారుస్తాయట. అందువలన మీరు మీ ప్రియమైన వారికి, బంధు మిత్రులకు ఇచ్చే బహుమానాలలో లేదా స్వీకరించే గిఫ్టులలో ఈ వస్తువులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి.

1) పాత పుస్తకాలు..

మనలో చాలా మంది పాత పుస్తకాలను పేద పిల్లలకు లేదా ఇతరులకు దానం చేస్తుంటాము. కానీ మన పుస్తకాలను మనం ఎప్పుడూ విరాళాలుగా ఇవ్వకూడదట. ఇవి పుస్తకాలు కాబట్టి మనం జ్ఞానం మరియు విజయాన్ని పొందుతాము. అందువల్ల వాటిని దానం ఇవ్వడం అంటే మీరు కష్టపడి సంపాదించిన జ్ఞానం మరియు విజయాన్ని ఇచ్చినట్టే అవుతుంది. అందుకే మనం కొత్త పుస్తకాలను దానం చేయాలి. పాత వాటిని దానం చేయకపోవడమే మంచిది.

2) తువాళ్లు మరియు నాప్ కిన్లు..

మన దేశంలోని చాలా ప్రాంతాల్లో తువ్వాళ్లు మరియు నాప్ కిన్లు బహుమతులుగా ఇస్తుంటారు లేదా స్వీకరిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి వస్తువులను ఎల్లప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవి ఇచ్చిన మరియు అందుకున్న వారి మధ్య విభేదాలకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా మీకు ఇలాంటివి బహుమానంా ఇస్తే, దానికి బదులుకు మీరు ఒక నాణెం ఇవ్వండి.

3) అక్వేరియం మరియు ఫౌంటేన్ వస్తువులు..

చాలా మందికి వాటర్ అక్వేరియం అంటే చాలా ఇష్టం. అందుకే అక్వేరియం ఫిష్ బౌల్స్ ను బహుమతులుగా ఇస్తుంటారు. వాటితో ఫౌంటెన్ వస్తువులను కూడా గిఫ్టులుగా ఇస్తారు. ఇది మీ అదృష్టానికి బాగా సహాయపడుతుంది. కానీ మీకు సంబంధించిన ఆర్థిక విషయాలలో నష్టాలను చేకూరుస్తుంది. అందుకే ఇలాంటి వాటి పట్ల ఇకనుండైనా జాగ్రత్తలు పాటించండి.

4) దేవుని ప్రతిమ మరియు విగ్రహాలు..

చాలా మంది ఎవరైనా తమ నూతన ఇంటి ప్రవేశానికి ఆహ్వానిస్తే మరియు అనేక పవిత్రమైన సందర్భాలలో దేవుని ప్రతిమను లేదా విగ్రహాలను బహుమతులుగా ఇస్తుంటారు. కాని ఇది మంచిది కాదు. ఈ బహుమతి మీరు ఎవరికైనా ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించిన వారు కూడా దానికి సరైన బహుమతి ఇవ్వాలి. దీనిపై మీకు అవగాహన లేకపోతే అంతే సంగతులు. ఎందుకంటే ఇలా ఈ ప్రతిమలను లేదా దేవుని విగ్రహాలను బహుమతిగా ఇచ్చినప్పుడు మరియు స్వీకరించినప్పుడు ఇద్దరికి చెడు జరిగే అవకాశముంది. అందుకే ఈ బహుమతిని ఇచ్చేటప్పుడు, సంరక్షణ బహుమతిని సరైన పద్ధతిలో ఇవ్వండి.

5) పని వస్తువులు..

చాలా మంది వారి ఆఫీసు లేదా ఇతర చోట్ల వారి పనికి సంబంధించిన వస్తువులను బహుమతులుగా ఇస్తుంటారు. ఎందుకంటే వారు పనిచేసే చోట తాము ఇచ్చిన గిఫ్ట్ తో పనిచేస్తే తాము గుర్తుకు వస్తామని అనుకుంటారు. కానీ అలా చేయడం ఆ గిఫ్ట్ ఇచ్చిన వారి పని తగ్గిపోతుంది. ఉదాహరణకు ఒక పెన్నును కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఇది ఇతర రంగాలకు కూడా వర్తిస్తుంది.

6) వంట వస్తువులు..

వంటగదికి అవసరమైన స్లైపర్లు మరియు కట్టర్లు, చాకు వంటి పదునైన వస్తువులను కూడా బహుమతులుగా ఇవ్వకూడదు, స్వీకరించకూడదు. ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తిని ప్రేరేపిస్తాయి. వీటిని బహుమతిగా ఇస్తే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు మన రిలేషన్ షిప్ లో సైతం సమస్యలు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

7) ఉక్కు మరియు ప్లాస్టిక్..

ఈ మధ్యన ప్లాస్టిక్ వస్తువులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో చాలా మంది ఇలాంటి వస్తువులను గిఫ్టులుగా ఇచ్చేస్తున్నారు. వీటితో కొన్ని ఉక్కు పాత్రలను కూడా బహుమతులుగా ఇస్తున్నారు , స్వీకరిస్తున్నారు. కానీ ఇవి మీ ఇంటి అదృష్టాన్ని, శ్రేయస్సును దిగజార్చుతుందని నమ్ముతారు. అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువులను దానం చేయడం వల్ల ఒకరి వ్యాపారానికి కూడా చెడుగా భావిస్తారు.

Check Also

ఆనందం వైపు పయనించు..!

Share this on WhatsAppతీరంలో నడుస్తున్న ఓ వ్యక్తికి.. ఒడ్డునపడి గిలగిలా కొట్టుకుంటున్న ఓ చేప కన్పించింది. ”అయ్యో!” అని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *