పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లి మండలం పాలితం గ్రామ వీఆర్వో అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కాడు. ఓ రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో లింగస్వామి అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టబడ్డాడు. పట్టాదారు పాసుపుస్తకంలో పేరు మార్పిడి కోసం వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు.
