Breaking News
Home / States / Telangana / చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటా…

చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటా…

సంగారెడ్డి: తన అనుచరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ గురువారం భేటీ అయ్యారు. ఆయన టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇటీవలనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే… ఈ స్థానాన్ని కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. కాగా… టీడీపీలో చేరి టికెట్ ఆశించినప్పటికీ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో నందీశ్వర్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తుండగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కార్యకర్తలతో జరిగిన భేటీలో నందీశ్వర్ గౌడ్ అన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీలో ఉన్న కాట శ్రీనివాస్‌గౌడ్… గురువారం నందీశ్వర్ గౌడ్‌ను కలిసి మద్దతు కోరారు.

Check Also

హైదరాబాద్ బోరబండలో దారుణం…

Share this on WhatsApp  హైదరాబాద్: బోరబండలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భూతవైద్యం పేరుతో ఓ దొంగ బాబా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *