Breaking News
Home / National / 252 పరుగులకే ఆలౌటైన తమిళనాడు….

252 పరుగులకే ఆలౌటైన తమిళనాడు….

బెంగళూరు: కర్ణాటక పేసర్‌ అభిమన్యు మిథున్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో ఇరగదీశాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో మిథున్‌ ఐదు వికెట్లతో చెలరేగి హ్యాట్రిక్‌ సాధించడంమే కాకుండా అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ ట్రోఫీలో హ్యాటిక్ర్‌ వికెట్లు సాధించిన తొలి కర్ణాటక బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మిథున్‌ అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది.

టాస్‌ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో అభినవ్‌ ముకుంద్‌- మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే మురళీ విజయ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరితే ముకుంద్‌(85) రాణించాడు. ఆ తర్వాత బాబా అపరాజిత్‌(66), విజయ్‌ శంకర్‌(38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కర్ణాటక బౌలర్లు మిథున్‌ ఐదు వికెట్లకు జతగా, కౌశిక్‌ రెండు వికెట్లు సాధించాడు. ప్రతీక్‌ జైన్‌, కృష్ణప్ప గౌతమ్‌లకు తలో వికెట్‌ లభించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *