బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న విజయ్‌హజారె ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కర్ణాటక ఆదిలోనే తమిళనాడుకు షాక్ ఇచ్చింది. ఖాతా తెరవకుమందే మురళీవిజయ్ను మిథున్ పెవిలియన్‌కు చేర్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తమిళనాడు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అపరజిత్(39*)తో కలిసి అభినవ్ ముకుంద (65*) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి సమన్వయంతో ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తున్నారు. 25 ఓవర్లు ముగిసేసరికి తమిళనాడు రెండు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.
