Breaking News
Home / National / తానా వనభోజనాల కార్యక్రమం విజయవంతం….

తానా వనభోజనాల కార్యక్రమం విజయవంతం….

అమెరికా: ఉత్తర అమెరికా (తానా) తెలుగు సంఘం ఫిలడెల్ఫియా టీమ్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 29వ తేదీన ఫిలడెల్ఫియాలోని కాలేజ్‌ విల్లే, ఎవాన్స్‌బర్గ్‌ స్టేట్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమం విజయవంతమైంది. ఈ వనభోజనాలకు వచ్చిన దాదాపు 800 మందిని ఆటలు, విందు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆటల పోటీల్లో అందరూ పాల్గొని ఎంజాయ్‌ చేశారు. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని పసందుగా నిర్వహించిన ఫిలడెల్ఫియా తానా టీమ్‌ను అందరూ అభినందించారు.

చిన్నవయస్సులోనే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన మలావత్‌ పూర్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తానా నాయకులు రవి పొట్లూరి, రవి మందలపు, లక్ష్మీదేవినేని, నాగరాజు నలజుల, సతీష్‌ చుండ్రు, రాజా కసుకుర్తి, సతీష్‌ తుమ్మల, మోహన్‌ మల్ల, సాయి జరుగుల, కృష్ణ కొనగళ్ళ, చైతన్య వడ్లపట్ల, రంజిత్‌ చాగంటి, సునీల్‌ కోగంటి, గోపీ, సాంబయ్య కోటపాటి, సరోజ పావులూరి, ఫణికంతేటి, చలం పావులూరి, బాలాజీ కరి, పృథ్వీరాజ్‌, వంశీ వాసిరెడ్డి, సురేష్‌ యలమంచిలి, కృష్ణ నందమూరి, రమ ముద్దన, రాజ్‌ కుకునూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *