Breaking News
Home / National / టాటా నెక్సాన్‌లో ఎలక్ట్రిక్‌ వెర్షన్‌

టాటా నెక్సాన్‌లో ఎలక్ట్రిక్‌ వెర్షన్‌

ఒక్కసారి చార్జింగ్‌తో 300 కిలో మీటర్ల ప్రయాణం
ధరల శ్రేణి రూ.15-17 లక్షలు
ముంబై: ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా తన పాపులర్‌ మోడల్‌ నెక్సాన్‌లో ఎలక్ర్టిక్‌ వెర్షన్‌ (ఈవీ)ను టాటా మోటార్స్‌ గురువారంనాడు ఆవిష్కరించింది. ఒక్కసారి పూర్తిగా చార్జింగ్‌ చేస్తే 300 కిలో మీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీపై ఎనిమిదేళ్ల గ్యారెంటీని కంపెనీ ఇస్తోంది. కొన్ని వారాల్లోనే నెక్సాన్‌ ఈవీని వాణిజ్యపరంగా విడుదల చేస్తామని, దీని ధరల శ్రేణి రూ.15-17 లక్షల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. జిప్‌ట్రాన్‌ టెక్నాలజీ కలిగిన ఈ కారు 9.9 సెకన్ల వ్యవధిలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 35 కనెక్టెడ్‌ ఫీచర్లున్నాయి.

ఇప్పటికే టిగోర్‌ మోడల్‌లో ఎలక్ర్టిక్‌ వెర్షన్‌ను టాటా మోటార్స్‌ అందుబాటులోకి తెచ్చింది. దీనికి ఆదరణ బాగుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 150 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇదిలా ఉంటే.. నెక్సాన్‌ ఈవీ ద్వారా ఇండివిడ్యువల్‌ కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. మొదటగా ఈ కారును 22 నగరాల్లో విడుదల చేస్తారు. ఈ శుక్రవారం నుంచే దీని బుకింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా లేదా ఎంపిక చేసిన క్రోమా స్టోర్ల ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇక నెక్సాన్‌ ఈవీ గరిష్ఠ ధర రూ.17 లక్షలున్నా.. ప్రస్తుత నెక్సాన్‌ ఏఎంటీ వెర్షన్‌కన్నా కేవలం 20 శాతం ఎక్కువ ధర అని కంపెనీ చెబుతోంది. కిలో మీటరుకు కేవలం రూ.1 ఖర్చుతో ఇందులో ప్రయాణం చేయవచ్చని టాటా మోటార్స్‌ ఎలక్ర్టిక్‌ మొబిలిటీ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *