Breaking News
Home / hyderabad / ‘500 చదరపు గజాల ఇంటికి ట్యాక్స్ రద్దు’

‘500 చదరపు గజాల ఇంటికి ట్యాక్స్ రద్దు’

హైదరాబాద్: మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అసలు పోటీలోనే లేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్‌ మున్సిపల్ ఎన్నికల విజన్ డాక్యుమెంట్‌లో అంశాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల విజన్ డాక్యుమెంట్‌ను ఉత్తమ్ విడుదల చేశారు.

మునిసిపాలిటీలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తిస్తామని, భవిష్యత్‌లో అధికారంలోకి రాగానే 500 చదరపు గజాల ఇంటికి మున్సిపల్ ట్యాక్స్ రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. 100 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ. 6 లక్షలు ఇస్తామని స్పష్టం చేసింది. ప్రతి మునిసిపాలిటీలో 100 పడకల ఆసుపత్రి, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.

Check Also

సికింద్రాబాద్‌లో నేపాల్ యువతి ఆత్మహత్య

Share this on WhatsAppసికింద్రాబాద్: పద్మారావునగర్‌లో నేపాల్ యువతి ఆత్మహత్య చేసుకుంది. సంవత్సరం క్రితమే ఈ జంట వివాహం చేసుకున్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *