Breaking News
Home / Politics / వైసీపీ గూటికి చేరిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు…

వైసీపీ గూటికి చేరిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు…

విశాఖపట్నం: పెందుర్తికి చెందిన కొందరు టీడీపీ, కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు నేడు వైసీపీ కార్యాలయంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ సమక్షంలో పార్టీలో చేరారు. అవంతి, అదీప్ రాజ్‌లు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెందుర్తిలో తొలి ప్రయత్నంలోనే అదీప్ రాజ్ విజయం సాధించారంటే కార్యకర్తల శ్రమే కారణమని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన చేపట్టిన హామీల అమలుకు ముగ్ధులై, ప్రజాభిమానాన్ని గమనించి ఇతర పార్టీల వారు వస్తున్నారని వారిని ఆహ్వానిస్తున్నామన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో కొత్త, పాత తేడా లేకుండా కార్యకర్తలంతా ఒకే జెండా ఒకే ఎజెండాగా పని చేసి వైసీపీకి అఖండ విజయం చేకూర్చాలన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండాలు మోస్తున్న కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *