Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సీఎం జగన్‌పై మాజీ మంత్రి ఫైర్

సీఎం జగన్‌పై మాజీ మంత్రి ఫైర్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 62 ప్రాజెక్టుల్లో 23 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని, ఆయన మిగిలిన ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడడంలేదని సీఎంను ప్రశ్నించారు. గోదావరి, పెన్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను ఎందుకు ఆపారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం పంపులు చూసి ఆనందించడం కంటే పట్టిసీమ పంపులు చూస్తే చంద్రబాబు కష్టం తెలుస్తుందన్నారు.

జగన్‌లా రూ. 80 కోట్లు పెట్టి రాజభవనాలు కట్టాలని తాము ఆలోచన చేయలేదని దేవినేని ఉమ అన్నారు. అమరావతిలో ఇటుక పెట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, పట్టిసీమ కట్టాలి, పురుషోత్తమ పట్నం పూర్తి చేయాలి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, కియా ఫ్యాక్టరీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన చేశామన్నారు. జగన్‌లా లోటస్ పాండ్‌లో రాజభవనం, బంజారాహిల్స్‌లో ఒక భవనం, బెంగళూరులో ప్యాలెస్, తాడేపల్లిలో ఇంధ్రభవనం ఇలాంటి భవనాలు కట్టాలనే సరదాలు తమకు లేవని దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విమర్శించారు.

Check Also

ధర్నా చౌక్‌కు చేరుకున్న చంద్రబాబు…

Share this on WhatsAppవిజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఇసుక దీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *