Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మద్యం మాఫియాను పెంచి పోషించేలా సర్కార్ చర్యలు…

మద్యం మాఫియాను పెంచి పోషించేలా సర్కార్ చర్యలు…

అమరావతి: ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యపాన నిషేధం ఓ భూటకమని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. పులివెందులలో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతోందని విమర్శించారు. రాష్ట్రంలో 20 శాతం మద్యం తగ్గించామని ప్రభుత్వం అబద్ధాలాడుతోందన్నారు. ‘జే’ టాక్స్ పేరుతో రూ. 2వేల కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టారని ఆమె ఆరోపించారు.

మద్యం మాఫియాను పెంచి పోషించేలా సర్కార్ చర్యలున్నాయని విమర్శించారు. పేదల రక్తం పీల్చేందుకే బాటిల్‌పై రూ.250 పెంచారన్నారు. రాష్ట్రంలో ఏ బ్రాండ్ మద్యం అమ్మాలో కేసీఆర్‌ని అడిగి జగన్ నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. దశలవారీగా మద్య నిషేధం పేరుతో దోచుకునేందుకు జగన్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆరోపించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *