Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీ నేత బుద్ధా వెంకన్న గృహ నిర్బంధం…

టీడీపీ నేత బుద్ధా వెంకన్న గృహ నిర్బంధం…

అమరావతి : అమరావతిలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావం తెలిపేందుకు సిద్ధమవుతోన్న టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. అమరావతిలోని మందడంలో రైతులు, మహిళలు దీక్ష కొనసాగిస్తున్నారు. గుంటూరులోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. సచివాలయానికి వెళ్లే ఉద్యోగులకు పూలు ఇస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *