Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రూ.60 ఖర్చవుతుందనడం హాస్యాస్పదం:టీడీపీ

రూ.60 ఖర్చవుతుందనడం హాస్యాస్పదం:టీడీపీ

అమరావతి: అమరావతిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడుతూ ప్రజాధనం వృథా వంకతో కోర్టు వాయిదాల నుంచి సీఎం జగన్‌ తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కోర్టుకు హాజరైతే రూ.60 ఖర్చవుతుందని చెప్పడం హాస్యాస్పదమని, అధికారంతో కేసులను ప్రభావితం చేసే ప్రమాదం గతం కన్నా ఇప్పుడు రెట్టింపు అయ్యిందని, సీఎం హాజరుకు మినహాయింపు అడగడంపై అనేక అనుమానాలు ఉన్నాయని యనమల తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులేనని, శిబుసోరెన్‌ సీఎంగా ఉన్నప్పుడు కోర్టుకు హాజరయ్యారని ఆయన గుర్తు చేశారు. హాజరు మినహాయింపును గతంలోనే సీబీఐ కోర్టు, హైకోర్టు తిరస్కరించాయన్నారు. అంతేకాకుండా మీడియాపై ఆంక్షలు విధించడం తగదని, రాష్ట్రంలో తప్పుడు వార్తలు వ్యాపింపచేస్తున్నది ఎవరో ప్రజలకు బాగా తెలుసని వైకాపా సర్కారును ఉద్దేశించి అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *