Breaking News
Home / States / Andhra Pradesh / స్పీకర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత…

స్పీకర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత…

శ్రీకాకుళం: స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలోనే స్పీకర్‌.. బయటకొస్తే చిల్లరగాడిలా తమ్మినేని వ్యవహరిస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని రవికుమార్‌ ఆరోపించారు. ఇసుక దోపిడీలో సూత్రధారిగా స్పీకర్, పాత్రధారులుగా కడప రెడ్లు ఉన్నారని విమర్శించారు. ఏపీఎండీసీ సాఫ్ట్‌వేర్‌ను తమ్మినేని, ఆయన కుమారుడు అక్రమంగా తీసుకుని కోట్లు దండుకుంటున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ పేదవాళ్ల కడుపుకొట్టి తమ్మినేని కడుపు నింపుతున్నారని కూన రవికుమార్‌ మండిపడ్డారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *