గుంటూరు: గురువారం టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక షర్మిల, జగన్, విజయలక్ష్మి పాత్ర ఉందని బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనలు ప్రజలింకా మర్చిపోలేదని అన్నారు. పీటర్ నివేదిక ఆధారంగా బొత్స రాజధానిపై మాట్లాడటమేంటని ప్రశ్నించారు. వైఫల్యాలను గత ప్రభుత్వంపై నెట్టి అసమర్థతను ఎక్కువ కాలం కప్పిపుచ్చలేరని, వ్యక్తిగత విమర్శలు మాని చేతనైతే అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 25మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామనీ, ఇప్పుడు ఢిల్లీ వెళ్లి మెడలు వంచుతూ ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారని కనకమేడల ఎద్దేవా చేశారు.
