Breaking News
Home / States / Andhra Pradesh / తప్పు చేస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమే…

తప్పు చేస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమే…

విజయవాడ: తమ పార్టీలోకి వస్తే అన్నీ సర్దుకుంటాయని కొంతమంది వైసీపీ నేతలు తనకు సూచించారని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇటీవల జేసీకి చెందిన దివాకర్ ట్రావెల్స్ సంస్థ బస్సులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో తన ఒక్కడిపైనే దాడి జరుగుతోందని అన్నారు. నిబంధనల ప్రకారం ట్రావెల్స్ నడుపుతున్నప్పటికీ కక్షపూరితంగా తమ బస్సులు సీజ్ చేస్తున్నారన్నారు. తాను తప్పు చేస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని ఆయన చెప్పారు. తనకు జరిగిన నష్టాన్ని అధికారులే భరించాలని కోరుతూ నోటీసులు ఇస్తానని, అవసరమైతే కోర్టుకు వెళతానని చెప్పారు.

Check Also

ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు నమోదు

Share this on WhatsAppఅమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *