విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని.. తాము కూడా ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు. సీఎం కుర్చీలో పిచ్చోడిని కూర్చొబెట్టినా ఇంకా బాగా పాలిస్తాడేమోనని వ్యాఖ్యానించారు. ఇసుక కోసం దీక్ష చేస్తే అరెస్ట్ చేస్తారా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
