గుంటూరు: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆర్థిక మంత్రా లేక పిట్ట కథల మంత్రా అని టీడీపీ నేత మాల్యాద్రి ఎద్దేవాచేశారు. తప్పుడు లెక్కలతో ప్రజలను బుగ్గన తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రూ.4కే పవన విద్యుత్ లభ్యమవుతుంటే రూ.11 పెట్టి థర్మల్ విద్యుత్‌ను ఎందుకు కొంటున్నారని విమర్శించారు. పీపీఏల రద్దుతో ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందని మాల్యాద్రి అన్నారు.
