విజయవాడ: వైఎస్సార్ కంటి వెలుగు పథకంపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 67 లక్షల మందికి కంటి పరీక్షలు జరిగాయని గుర్తుచేశారు. అలాగే కళ్ళజోళ్లు కూడా ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు అదే పథకానికి వైఎస్ పేరు తగిలించి.. కొత్త పథకంగా ప్రచారం చేయడం సీఎం జగన్కు తగదని హితవు పలికారు.
