Breaking News
Home / States / Andhra Pradesh / మూడు నెలలకే ఏపీని అంధకారం చేశారు…

మూడు నెలలకే ఏపీని అంధకారం చేశారు…

గుంటూరు: వర్ష కాలంలో కరెంట్ కోతలు విధిస్తున్న ఘనత ఏపీ సీఎం జగన్‌కే దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి పేర్కొన్నారు. మూడు నెలలకే ఏపీని అంధకారం చేశారన్నారు. మిగులు విద్యుత్ ఉన్న రాష్టాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారని ఆరోపించారు.

జగన్ చేతగానితనం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కోతలని మద్దాలి గిరి పేర్కొన్నారు. పీపీఏల విషయంలో కోర్టులు మొట్టికాయలు వేసినా చలనం లేదన్నారు. నేడు జగన్ అవగాహన లోపం వల్ల పరిశ్రమలకు గడ్డుకాలం రాబోతోందన్నారు. మీ మిత్రుడు కేసీఆర్ నుంచి బొగ్గు ఎందుకు తెచ్చుకోలేక పోతున్నారని మద్దాలి గిరి ప్రశ్నించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *