Breaking News
Home / States / Andhra Pradesh / స్పీకర్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత…

స్పీకర్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత…

విజయవాడ: అమరావతిని ఎడారి అంటూ స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రంగా స్పందించారు. స్పీకర్ కళ్లులేని కబోదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతి ఎడారిలా ఉందని మాట్లాడటం తప్పు అన్నారు. స్పీకర్ సీతారం ఎడారిలో కూర్చొనే అసెంబ్లీని నడుపుతున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో 400 ఎకరాల ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని నిరూపిస్తే అసెంబ్లీ ఎదుట ఆత్మహత్య చేసుకునేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు. నిరూపించకపోతే మంత్రి బుగ్గన రాజధాని రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ మంత్రివర్గం అంతా ఫ్యాక్షనిస్టు విధానంలో నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *