Breaking News
Home / States / Andhra Pradesh / జగన్ కేసులో తీర్పును రిజర్వులో పెట్టి సీబీఐ…

జగన్ కేసులో తీర్పును రిజర్వులో పెట్టి సీబీఐ…

గుంటూరు: అక్రమ ఆస్తుల కేసులో సీఎం జగన్‌కు ఎందుకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ కేసులో జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై శుక్రవారం వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. దీనిపై స్పందించిన వర్ల కేసును త్వరగా విచారించి తీర్పు చెప్పమని కోర్టును కోరాలన్నారు. జగన్‌ నిర్దోషిగా బయటికి వస్తే ప్రజలు హర్షిస్తారని, చిదంబరానికి బెయిల్‌ ఇచ్చేటప్పుడు కూడా జగన్‌ కేసును కోర్టు ప్రస్తావించిందని తెలిపారు. సీఎం డౌన్‌ డౌన్ అన్న కేసుకు రూ.43 వేల కోట్లు కొట్టేసిన కేసు సమానమా? అని ఆయన ప్రశ్నించారు. చిన్న చిన్న కేసులకు తమని జైలుకు పంపిస్తున్నారని, జగన్‌ సీబీఐని ఎందుకు బెదిరిస్తున్నారని అడిగారు. జగన్‌పై ఉన్న కేసులు, టీడీపీ నేతలపై ఉన్న కేసుల చర్చకు సిద్ధమా? అని వైసీపీ నేతలకు వర్ల సవాల్ విసిరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *