Breaking News
Home / States / Andhra Pradesh / భూములిచ్చిన రైతులపై కక్ష ఎందుకు….

భూములిచ్చిన రైతులపై కక్ష ఎందుకు….

గుంటూరు: సీఎం జగన్ రాష్ట్ర రాజధాని అమరావతిని అడవిగా మార్చారని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రోజుకోమాట పూటకోబాట తరహాలో వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయన్నారు. ఆర్థిక సంస్థల నుంచి అమరావతికి వచ్చే నిధులకు వైసీపీ నేతలు తూట్లు పొడిచారన్నారు. 5కోట్ల ఆంధ్రులపై, అమరావతికి భూములిచ్చిన రైతులపై కక్ష ఎందుకు అని ప్రశ్నించారు. అమరావతిలో నిర్మాణ వ్యయం పెరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జె ట్యాక్స్ కోసమే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *