Breaking News
Home / States / Andhra Pradesh / బీజేపీ ఎంపీతో టీడీపీ ఎమ్మెల్యే భేటీ….

బీజేపీ ఎంపీతో టీడీపీ ఎమ్మెల్యే భేటీ….

గుంటూరు: కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా వంశీ పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో సుజనాని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా వీరిద్ధరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల ఏపీలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డిని వంశీ కలిసినప్పటి నుంచే ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో సుజనా చౌదరి కూడా బీజేపీలో చేరాలంటూ వంశీని ఆహ్వానించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. మరోవైపు వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *