Breaking News
Home / States / Andhra Pradesh / ఇదేం సంస్కృతి..? : టీడీపీ ఎమ్మెల్సీ

ఇదేం సంస్కృతి..? : టీడీపీ ఎమ్మెల్సీ

గుంటూరు: శుక్రవారం టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతా మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మద్యపాన నిషేధం ముసుగులో భారీ స్కామ్‌కు తెరదీశారని విమర్శించారు. కొత్త మద్యం పాలసీ ముసుగులో రూ. వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానివన్నీ ఉత్తుత్తి ప్రగల్భాలేనని, జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఏపీ ప్రజలను నిండా ముంచుతున్నారన్నారు. జనావాసాల మధ్య మద్యం షాపులు పెట్టి మహిళల ఉసురుపోసుకుంటున్నారని, పెంచిన రేట్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని ఆమె ప్రశ్నించారు. మద్యం దుకాణాలలో ప్రభుత్వానికి నచ్చిన నాలుగు కంపెనీల బ్రాండ్లనే పెడుతున్నారని, ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న యువత చేత సారా అమ్మిస్తారా..? ఇదేం సంస్కృతి..? అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *