గుంటూరు: సోమవారం టీడీపీ ఎమ్మెల్సీ చంగలరాయుడు మీడియాతో మాట్లాడుతూ వ్యక్తులు శాశ్వతం కాదని, ప్రభుత్వాలు శాశ్వతమని పరిపాలన నిరంతర ప్రక్రియ అని అన్నారు. గత ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులు తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చెల్లించాల్సిందేనని తెలిపారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి , చంద్రబాబు అందరూ ఈ విధానాన్ని కొనసాగించారని, పాదయాత్రలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. అలాగే జగన్ కూడా పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు.
