Breaking News
Home / States / Andhra Pradesh / రాజధానిపై ఆ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారు……

రాజధానిపై ఆ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారు……

విజయవాడ: విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన పార్టీ విస్త్రృతస్థాయి సమావేశంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని, రాజధానిపై వైసీపీ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధానిని మారుస్తానని సీఎం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, టీడీపీను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు. కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో భాగంగా మూడు రోజుల పాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *