Breaking News
Home / States / జగన్‌తో టీడీపీ ఎంపీ అవంతి భేటీ

జగన్‌తో టీడీపీ ఎంపీ అవంతి భేటీ

హైదరాబాద్: వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌తో అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ భేటీ అయ్యారు. మరికాసేపట్లో ఆయన వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. అవంతి భీమిలి అసెంబ్లీ సీటు అడిగినట్లు తెలుస్తోంది. దీనికి జగన్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే భీమిలి సీటు తనదేనని నియోజకవర్గ సమన్వయకర్త విజయనిర్మల ప్రకటించారు. భీమిలీ సీటు విషయంలో ఇప్పటికే జగన్ తనకు హామీ ఇచ్చారని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్ రావాలని తనకు అధిష్టానం నుంచి పిలుపు రాలేదని తెలిపారు. అయినా పార్టీలో ఎవరైనా చేరొచ్చని ఆమె వ్యాఖ్యానించారు.

Check Also

కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం

Share this on WhatsAppఅమరావతి: కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *