Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుంది…

టీడీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుంది…

అమరావతి: ఉల్లి సమస్య ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే లేదు దేశ వ్యాప్తంగా ఉందని, కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉల్లి మీద లొల్లి చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను తీర్చడానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కిలో ఉల్లిని రూ. 25 సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఉల్లి ధర నిర్ణయించాల్సింది కేంద్రమేనని, ఆ మాత్రం విషయం కూడా చంద్రబాబుకు తెలియదా అని విమర్శించారు. ఉల్లి అక్రమ నిల్వలు చేస్తున్న వారిపై విజలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విప్‌ కోరుముట్లు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. డిసెంబర్‌12న 2100 మెట్రిక్‌ టన్నుల ఉల్లిని దిగుబమతి చేస్తున్నామని, రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. టీడీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుందని, గుడివాడలో సాంబిరెడ్డి మరణాన్ని రాజకీయం చేయటం తగదని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *