హైదరాబాద్: హుజూర్నగర్ ఉపఎన్నికల్లో సీపీఎం మద్దతును టీడీపీ కోరింది. మద్దతు వ్యవహారంపై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్లో మాట్లాడగా పార్టీతో చర్చించి నిర్ణయం చెబుతామని తమ్మినేని తెలిపారు. తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ కావడంతో సీపీఎం బరిలో లేదు.
