Breaking News
Home / Lifestyle / Business / చాయ్ హోమ్ డెలివరీ… రూ.2 కోట్ల టర్న్ఓవర్

చాయ్ హోమ్ డెలివరీ… రూ.2 కోట్ల టర్న్ఓవర్

లక్నో: ‘టీ దుకాణం… కోట్లలో వ్యాపారం’… వినడానికి వింతగానే ఉన్నా ఇది అతశయోక్తేమీ కాదు. ఇద్దరు ఇంజినీరింగ్ స్నేహితులు పిజ్జా తదితర ఆహారపదార్థాలతో పాటు చాయ్ కూడా హోం డెలివరీ చేయడం ప్రారంభించారు. ఈ పనిని ప్రారంభించిన కొద్ది సంవత్సరాల్లోనే వీరి వ్యాపారం మరింతగా విస్తరించింది. కాన్నివేల మంది ప్రతీరోజూ వారి ఇళ్లకు లేదా కార్యాలయాలకు వీరి దగ్గరి నుంచి టీ తెప్పించుకుంటున్నారు. అభినవ్ టండన్, ప్రమిత్‌శర్మలు నెలకొల్పిన ఈ టీ చైన్ పేరు ‘చాయ్ కాలింగ్’. ప్రస్తుతం యూపీలో ఈ చైన్‌కు సంబంధించి 15 టీ స్టాళ్లు నడుస్తున్నాయి. వీటి నుంచి ప్రతీ యేటా రూ. 2 కోట్ల ఆదాయం వస్తోంది. బరేలీకి చెందిన అభినవ్, ప్రమిత్ లక్నోలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తరువాత వీరిద్దరూ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేశారు. తరువాత వారికి సొంతగా ఏదైనా చేయాలని అనిపించింది. 2014లో వీరిద్దరూ ‘చాయ్ కాలింగ్’ పేరుతో నోయిడా సెక్టార్-16లోని మెట్రో‌స్టేషన్ వద్ద ఒక టీ స్టాల్ ప్రారంభించారు. అభినవ్ తమ వ్యాపారం గురించి మాట్లాడుతూ ‘ఆఫీసులో పనిచేసే సమయంలో అలసటగా ఉన్నప్పుడు టీ తాగాలని అనిపిస్తుంది. ఈ ఆలోచనతోనే ఇద్దరు స్నేహితులం కలసి టీ స్టాల్ ప్రారంభించాం. తరువాత ‘చాయ్ కాలింగ్’ పేరిట వెబ్‌సైట్ కూడా స్టార్ట్ చేశాం. వ్యాపారం పెరుగుతున్న కొద్దీ ఆఫీసులతో కాంట్రాక్టులు లభించాయి. ఒక కప్పు టీ 10 రూపాయలకు విక్రయిస్తున్నాం. ఈ వ్యాపారం మరింత వృద్ధి చెందడంతో 15 నిముషాల్లోనే ఇళ్లకు కూడా చాయ్ డెలివరీ చేయడం ప్రారంభించాం. ఇప్పుడు నోయిడాలో రెండు, బరేలీలో 6 స్టాళ్లను ప్రారంభించాం. 2015లో రూ. 50 లక్షలుగా ఉన్న టీ వ్యాపారం 2019 నాటికి రూ. 2 కోట్లకు చేరుకుంది. దీనితోపాటు ‘చాయ్ కాలింగ్’ ద్వారా 100 మంది యువకులకు ఉపాధి దొరికిందని తెలిపారు.

Check Also

రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

Share this on WhatsAppబెంగళూరు: ‘అనర్హత వేటు’ అంశం మరోసారి కర్ణాటక రాజకీయ సంక్షోభం, విశ్వాస పరీక్ష నేపథ్యంలో చర్చకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *