Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / నారాయణ స్కూల్‌లో కీచక టీచర్….

నారాయణ స్కూల్‌లో కీచక టీచర్….

అనంతపురం: అనంతపురంలోని నారాయణ స్కూల్‌లో సైన్స్‌ టీచర్‌గా పని చేస్తున్న కార్తీక్‌ వాట్సప్‌ ద్వారా ఎనిమిదో తరగతి విద్యార్థినికి అశ్లీల పోస్టింగ్స్‌, మెసేజ్‌లు పంపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థిని తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం కీచక టీచర్‌ను నిలదీశారు. అయితే అతగాడు బుకాయించడంతో ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు దేహశుద్ధి చేశారు. ఇంత జరిగినా ఈ విషయాన్ని నారాయణ స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచింది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *