Breaking News
Home / States / Andhra Pradesh / ఉపాధ్యాయ సంఘం నాయకుడు మృతి…

ఉపాధ్యాయ సంఘం నాయకుడు మృతి…

కొండాపురం: కొండాపురం మండలం తాళ్ళ ప్రొద్దుటూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా, ఉపాధ్యాయ సంఘం నాయకులుగా పనిచేసి ఎనలేనిసేవలను అందించిన అవిశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు కొక్కంటి బాల శిద్దారెడ్డి శుక్రవారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు భార్య లక్ష్మీ దేవమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. శిద్దారెడ్డి అంత్యక్రియలు (20 న) ఆదివారం ఉదయం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం పట్ల ఎపిటిఎఫ్‌ కొండాపురం మండల శాఖకు చెందిన ఎన్‌.జయ అంకిరెడ్డి, వి.సుబ్బారెడ్డి, ఎంవి.భాస్కర్‌ రెడ్డి, జి.రామలింగేశ్వరరెడ్డి, పి.ప్రభాకర్‌ నాయుడు, డి.సుధాకర్‌ రెడ్డి, డి.దామోదర్‌ రెడ్డి తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *