పట్నా: బీహార్ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రత్యేక శైలి వేషధారణతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఒకసారి శివుడుగా మారిపోతారు. మరోసారి కృష్ణుడుగా కనిపిస్తారు. అతను నడిపించే రాజకీయాలను మించి అతని ‘లుక్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. ఇప్పుడు మళ్లీ తేజ్ ప్రతాప్ తన లుక్ మార్చారు. ట్విట్టర్లో ఆయన ఒక ఫొటో షేర్ చేశారు. దానిలో తేజ్ బొట్టుపెట్టుకుని, గ్రీన్ కలర్ టోపీ ధరించి కనిపిస్తున్నారు. అలాగే ఆయన తన జుట్టును కూడా పెంచారు. ఆర్జేడీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం తేజ్ ప్రతాప్ ఈ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోను షేర్ చేసిన తేజ్…. ‘రాబోయే సంవత్సరంలో జరిగే బీహార్ ‘కురుక్షేత్రం’లో మన అర్జునుడు తేజశ్వి… విజయరథంపై సవారీ చేయాలని సంకల్పం చేశారు’ అని రాశారు
